సిరాజ్ ను పట్టించుకోని RCB, గుజరాత్ కు హైదరాబాదీ పేసర్
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు షాకిచ్చింది. వేలంలో అతని కోసం ఆర్సీబీ బిడ్ వేసేందుకు కూడా ప్రయత్నించలేదు.
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు షాకిచ్చింది. వేలంలో అతని కోసం ఆర్సీబీ బిడ్ వేసేందుకు కూడా ప్రయత్నించలేదు. దీంతో ఆర్సీబీతో సిరాజ్ 6 ఏళ్ల బంధానికి తెరపడింది. సిరాజ్ కోసం ఆర్‌టీఎమ్ కార్డ్ ఉపయోగించకునేందుకు కూడా బెంగళూరు ఆపసక్తి చూపలేదు. 2 కోట్ల కనీస ధరతో సిరాజ్ వేలానికి అందుబాటులోకి రాగా.. గుజారత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఆసక్తికనబర్చాయి. 8 కోట్ల వరకు బిడ్ వేసిన చెన్నై.. ఆ తర్వాత తప్పుకుంది. రాజస్థాన్‌తో పోటీపడిన గుజరాత్ రూ. 12.25 కోట్లకు సొంతం చేసుకుంది. ఆర్‌టీఎమ్ కార్డ్ ఉపయోగిస్తారా అని ఆర్‌సీబీని అడగ్గా నిరాకరించింది. దాంతో సిరాజ్.. గుజరాత్ సొంతమయ్యాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ 12.25 కోట్లకు ఈ హైదరాబాద్ పేసర్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 93 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన సిరాజ్.. 93 వికెట్లు తీసాడు.