Bigg Boss season 8 : బిగ్‌బాస్ సీజన్ 8కు రెడీ.. హౌజ్‌లోకి హేమ.. కంటెస్టెంట్లు వీళ్లే..
బిగ్‌బాస్ (Bigg Boss) క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సామాన్యులను సెలబ్రిటీల (Celebrities) ను చేస్తుంది.. సెలబ్రిటీల్లోని హీరోలను పరిచయం చేస్తుంది. తెలుగులో అయితే ఈ ప్రోగ్రామ్ మరీ ఫాలోయింగ్ ఎక్కువ. తెలుగులో సీజన్ 8 స్టార్ట్ చేసేందుకు చానెల్ నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కంటెస్టెంట్‌ల ఎంపికపై కూడా ఓ క్లారిటీకి వచ్చేశారు.
బిగ్‌బాస్ (Bigg Boss) క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సామాన్యులను సెలబ్రిటీల (Celebrities) ను చేస్తుంది.. సెలబ్రిటీల్లోని హీరోలను పరిచయం చేస్తుంది. తెలుగులో అయితే ఈ ప్రోగ్రామ్ మరీ ఫాలోయింగ్ ఎక్కువ. తెలుగులో సీజన్ 8 స్టార్ట్ చేసేందుకు చానెల్ నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కంటెస్టెంట్‌ల ఎంపికపై కూడా ఓ క్లారిటీకి వచ్చేశారు. వాళ్లు కూడా దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఆ లిస్ట్ చూస్తే.. క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది. ప్రతీ సీజన్‌లో ఒక యూట్యూబర్‌ను కంటెస్టెంట్‌గా తీసుకువస్తుంటారు. బిగ్ బాస్ సీజన్ 8లో (Bigg Boss season 8) బమ్‌చిక్ బబ్లూనూ తీసుకోబోతున్నారు. యంగ్ హీరో (Young Hero) రాజ్ తరుణ్ (Raj Tarun) కూడా.. బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయ్. రాజ్‌తరుణ్ హీరోగా సక్సెస్ కొట్టి ఏళ్లు అవుతోంది. హౌజ్‌లోకి వస్తే తన కెరీర్‌కు ప్లస్ అవుతుందని రాజ్‌తరుణ్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయన్సర్, విరూపాక్ష ఫేమ్ సోనియా సింగ్ కూడా బిగ్‌బాస్‌లో అడుగుపెట్టబోతుందట.
ఇక నటి హేమ కూడా బిగ్‌బాస్ లోకి రాబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఓ సీజన్‌లో బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్ చేసిన హేమ.. మొదటి వారమే ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. ఐతే ప్రస్తుతం పర్సనల్ లైఫ్ చుట్టూ కాంట్రవర్సీలు తిరుగుతూ ఉండడంతో.. హేమ (Hema) ను కంటెస్టెంట్‌గా తీసుకుంటే సీజన్‌కు హైప్ వస్తుందని చానెల్ ప్రతినిధులు ఆలోచిస్తున్నారట. ఇక ఈ రియాలిటీ షోకు అప్పుడప్పుడు రియల్ లైఫ్ కపుల్స్ వస్తుంటారు. ఐతే ఈసారి మాత్రం కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేశారని తెలుస్తోంది. విడాకులు తీసుకున్న మాజీ ఇన్‌ఫ్యూయన్సర్ నేత్ర, మోటివేషనల్ స్పీకర్ వంశీకృష్ణ.. హౌజ్‌లో అడుగుపెట్టే చాన్స్ ఉందని అంటున్నారు. ఇక జబర్దస్త్ నుంచి బిగ్‌బాస్‌కు ప్రతీ సీజన్ ఎవరో ఒక షిఫ్ట్ అవుతూనే ఉంటారు. అలా ఈసారి నరేశ్, రియాజ్, కిరాక్ ఆర్పీలో ఎవరో ఒకరు కంటెస్టెంట్‌గా వచ్చే చాన్స్ ఉందని తెలుస్తోంది. యాంకర్ కమ్ నటి రీతూ చౌదరిని కూడా బిగ్‌బాస్ నిర్వాహకులు సంప్రదించినట్లు టాక్ నడుస్తోంది. స్ట్రీట్‌ఫుడ్‌తో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన కుమారి ఆంటీని కూడా.. బిగ్‌బాస్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట.
ఇప్పటికే మా టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్‌లో కుమారి ఆంటీ మెరిసింది. సోషల్ మీడియ ఇన్‌ఫ్లూయన్సర్‌గానే కాకుండా పొలిటికల్‌గానూ క్రేజ్ తెచ్చుకున్న బర్రెలక్కను కూడా సీజన్ 8 కోసం బిగ్‌బాస్ నిర్వాహకులు సంప్రదిస్తున్నట్లు టాక్. వీళ్లతో పాటు బుల్లెట్ భాస్కర్, చమ్మక్ చంద్రలో ఒకరిని తీసుకునే ప్లాన్ జరుగుతోంది. బజ్జీల పాపగా ఫేమస్ అయిన నటి కుషిత కల్లపును కూడా బిగ్‌బాస్ నిర్వాహకులు కాంటాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నల్గొండ పరువు హత్య తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఒక్కరిని తెలిశారు అమృతప్రణయ్. ఆమెను కూడా బిగ్‌బాస్ సీజన్8లోకి తీసుకుంటే బాగుంటుందని నిర్వాహకులు అనుకుంటున్నారట. మరి ఇందులో ఎవరు ఫైనల్ అవుతారు.. చివరికి హౌజ్‌లోకి అడుగుపెట్టేది ఎవరు అనేది తెలియాలంటే.. వెయిట్ అండ్ వాచ్..