Amarnath Yatra 2024 : అమర్‌నాథ్ యాత్రకు రికార్డు స్థాయిలో యాత్రికులు… 29 రోజుల్లో 4.51 లక్షల మంది దర్శనం
అమర్‌నాథ్ యాత్రకు రికార్డు స్థాయిలో భక్తులు తరలి వస్తున్నారు. జూన్ 29 వ తేదీన ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రకు రోజూ వేలాది మంది భక్తులు హిమాలయాల్లోని ఆ మంచు శివలింగం దర్శనం కోసం వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు.
అమర్‌నాథ్ యాత్రకు రికార్డు స్థాయిలో భక్తులు తరలి వస్తున్నారు. జూన్ 29 వ తేదీన ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రకు రోజూ వేలాది మంది భక్తులు హిమాలయాల్లోని ఆ మంచు శివలింగం దర్శనం కోసం వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు. అమర్‌నాథ్ యాత్ర గత నెల 29 వ తేదీన ప్రారంభం అయ్యింది. కాగా నెల 4 వ తేదీ వరకు కేవలం 6 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 1,30,260 మంది భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. ఇక ఇందులో గురువారం ఒక్క రోజే ఏకంగా 24 వేల మంది యాత్రికులు దర్శనం చేసుకున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు.. బుధవారం 30 వేల మందికి పైగా భక్తులు అమర్‌నాథ్ యాత్రలో చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ యాత్ర మొదలైన తర్వా త 16 రోజుల్లోనే 3 లక్షల మందికిపైగా భక్తులు అమరలింగేశ్వరుని దర్శించుకుని అమర్నాథ్ చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు.
గత 29 రోజుల్లో 4.51 లక్షల మంది భక్తులు అమర్‌నాథ్ యాత్రలో పాల్గొన్నట్లు శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు (SASB) వెల్లడించింది. గతేడాది 4.45 లక్షల మంది అమర్‌నాథ్ యాత్రలో పాల్గొన్నట్లు పేర్కొంది. శనివారం సుమారు 8,000 మంది యాత్రికులు గుహకు చేరుకుని పూజలు చేశారు. మరో 1,677 మంది యాత్రికులు ఆదివారం లోయకు బయలుదేరారు. దీంతో అమర్‌నాథ్ యాత్రకు రికార్డు స్థాయిలో యాత్రికులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాదితో పోల్చితే ఈసారి యాత్రికుల సంఖ్య భారీగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. యాత్ర ప్రారంభం అయిన వారం రోజుల్లోనే లక్షన్నర మంది యాత్రికుల కంటే ఎక్కువ మంది అమర్‌నాథ్ యాత్రలో పాల్గొన్నట్లు చెప్పారు. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రకు పోటెత్తున్న భక్తులు వేవ్ చూస్తుంటే శివ లింగాన్ని సందర్శించే వారి సంఖ్య గత సంవత్సరం రికార్డును కూడా బద్దలు కేటేలా ఉంది.