Kedarnath Yatra : కేదార్ నాథ్ లో రెడ్ అలర్ట్.. కేదార్ నాథ్ యాత్ర నిలిపివేత.. కేధార్ నాథ్ లో చిక్కుకున్న 16 వందల మంది యాత్రికులు
ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలో భారీ వర్షాలు కుంభవృష్టి కురిపిస్తుంది. భారీ వర్షాలతో మందాకిని, అలకనంద, భగీరద నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

Red alert in Kedarnath.. Kedarnath yatra suspended.. 16 hundred pilgrims trapped in Kedarnath
ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలో భారీ వర్షాలు కుంభవృష్టి కురిపిస్తుంది. భారీ వర్షాలతో మందాకిని, అలకనంద, భగీరద నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో చార్ ధామ్ యాత్ర (Char Dham Yatra) జరుగుతుంది. కేధార్ నాథ్ యాత్ర చేసేందుకు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున్న యాత్రికులు, శివ భక్తులు తరలివస్తున్నారు. రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న కేధార్ క్షేత్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కేధార్ నాథ్ ట్రెక్కింగ్ (Kedarnath Trekking) కు బయలు దేరిన యాత్రికులు మధ్యలో.. మరి కొంతరు కేధార్ నాథ్ క్షేత్రంలో చిక్కుకున్నారు. ఇప్పటి వరకు కేదార్ నాథ్ (Kedarnath) లో దాదాపు 16 వందల మంది యాత్రికులు చిక్కుకున్నారు. గౌరీకుండ్-కేదార్‌నాథ్ (Gaurikund-Kedarnath) ట్రెక్కింగ్ దారిలో చిక్కుకుపోయిన 3 వేల మందిని యాత్రికులను రెస్క్యూ టీమ్స్ రక్షించింది. ఇక కేదార్నాథ్ క్షేత్రం వద్ద చిక్కుకుపోయిన యాత్రికులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (Indian Air Force) 5 (MI 17) హెలికాప్టర్ల ద్వారా భక్తులను రక్షిస్తుంది. ఉత్తరాఖండ్ లో ఆకస్మిక వరదలకు (Flash floods) అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామికి (CM Pushkar Singh Dhami) హామీ ఇచ్చినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొన్నట్లు వెల్లడించారు. మరోవైపు తాజా పరిస్థితులపై ఉత్తరాఖండ్ స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ సమీక్షిస్తుంది. అటు కేంద్రం నుంచి కూడా కేంద్ర మంత్రి జేపీ నడ్డా సైతం ఉత్తరాఖండ్ పరిస్థితిపై సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి : Uttarakhand Heavy Floods : ఉత్తరాఖండ్‌లో భారీ వర్షం.. కేధార్ నాథ్ లో చిక్కుకున్న 571 యాత్రికులు..
- కేధార్ నాథ్ లో విరిగిపడ్డ కొండచరియలు..
కేదార్‌నాథ్‌లో దాదాపు 16 వందల మంది యాత్రికులు చిక్కుకున్నారు. మరో వైపు ఆకస్మికంగా ఘోరపరావ్, లించోలి, బడి లించోలి, భీంబాలి వద్ద కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి ఈ ఘటనలో 18 మంది భక్తులు గల్లంతు అయ్యారు. గల్లంతైన వారికోసం హెలికాప్టర్లు, డోన్లతో గాలిస్తున్న సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనలో లించోలి, భీంబాలి నుంచి రక్షణ శాఖ హెలికాప్టర్ల ద్వారా 42 మంది యాత్రికులను రెస్క్యూ చేసి.. సోన్ ప్రయాగ్ కు తరలించింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా కేదార్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేశారు BRO అధికారులు..
ఇది కూడా చదవండి : Himachal Heavy Snowfall : హిమాచల్ లో భారీగా హిమపాతం.. మనాలి లో విరిగిపడ్డ కొండచరియలు.. 3 నేషనల్ NH హైవేలు మూసివేత..
మరో వైపు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు.. హరిద్వార్ (Haridwar), తెహ్రీ, డెహ్రాడూన్ (Dehradun), చమోలీ జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. హిమని నదులు నీటి ప్రవాహం క్షణ క్షణానికి పెరగడంతో.. దిగువనున్న దేవప్రయాగ్, రిషికేష్ (Rishikesh), హరిద్వార్, హరికి పూరి పుష్కరిణి ఘాట్ లో ప్రమాదకరి స్థాయిలో వరద నీరు ప్రవహిస్తుంది. బుధవారం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి 14 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. డెహ్రాడూన్ లో 4, హరిద్వార్ లో 4, తెహ్రీలో 3, చమోలీ జిల్లాలో 1, చనిపోయినట్లు BRO అధికారులు తెలిపారు. మరో 50 మందికి పైగా గాయపడినట్లు వెల్లడించారు.