Tirumala : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల కంపార్ట్ మెంట్లలో కాకుండా నేరుగా దర్శనం కోసం క్యూలైన్లో నిలబడి ఉన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల కంపార్ట్ మెంట్లలో కాకుండా నేరుగా దర్శనం కోసం క్యూలైన్లో నిలబడి ఉన్నారు. ఇవాళ శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శ్రీ వారి సర్వ దర్శనం కోసం ఐదు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 60,928 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారికి తలనీలాలు సమర్పించిన భక్తులు సంఖ్య 22,358 మంది. శ్రీవారికి భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.34 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు.