Anant Ambani Honeymoon : అనంత్, రాధిక హనీమూన్ ఇక్కడేనా..
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయ్. జూలై 12న రాత్రి 8గంటలకు ముకేశ్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం.. రాధిక మర్చంట్‌తో ఘనంగా జరిగింది.

Reliance chief Mukesh Ambani's wedding ceremony was held grandly.
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయ్. జూలై 12న రాత్రి 8గంటలకు ముకేశ్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం.. రాధిక మర్చంట్‌తో ఘనంగా జరిగింది. ప్రపంచంలోని సెలబ్రిటీ అందరూ వచ్చిన వేళ.. మూడు ముళ్లు, ఏడడుగుల సాక్షిగా ఆ జంట ఒక్కటయ్యారు. మూడు రోజుల పాటు జరిగిన పెళ్లిలో.. లైఫ్ టైమ్‌కు కావాల్సిన చాలా మెమొరీస్ మిగిల్చుకుంది అంబానీ ఫ్యామిలీ.
దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. పెళ్లికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తారలంతా వచ్చేయగా.. పేదలకు దాదాపు 40రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇప్పటికే ప్రతిరోజూ మూడుపూటలా పంచభక్ష పరమాన్నాలు వడ్డిస్తున్నారు కూడా. మరోవైపు పెళ్లికి ముందే సామూహిక వివాహాలు జరిపించి మరీ… విలువైన వస్తువులు, వెండి, బంగారం కానుకగా ఇచ్చారు. ఇప్పుడు లండన్‌లో రిసెప్షన్ ఈవెంట్ కోసం.. అంబానీ ఫ్యామిలీ అక్కడికి వెళ్లింది. ఐతే అక్కడ చిన్న కొడుకు అనంత్‌కు.. నీతా అంబానీ వెయ్యి కోట్ల విలువైన విల్లా బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇందులోనే హనీమూన్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. బంగారం, వజ్రాలతో డెకరేట్ చేసిన క్లిప్పింగ్స్ చూసి షాక్ అవుతున్నారు జనాలు. మరీ ఇంత కాస్ట్‌లీగా బతుకుతారా అని డిస్కస్ చేసుకుంటున్నారు. ఐతే ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స మహిమ అని.. అసలు అందులో నిజం లేదని.. కొందరు కామెంట్ చేస్తున్నారు.
ఇది నిజం అయినా కాకపోయినా.. అంబానీ లావిష్ వెడ్డింగ్ గురించి ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుకుంటోంది. బట్టలను కూడా బంగారంతో డిజైన్ చేయడం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. రాధికా మర్చంట్ అప్పగింతలకు సంబంధించిన బట్టలను మేలిమి బంగారంతో డిజైన్ చేశారు. గుజరాతీ సాంప్రదాయ రంగులైన తెలుపు, ఎరుపు మేళవింపు బట్టల్లో వధువుగా మెరిసిపోయింది రాధిక. అప్పగింతలకు సంబంధించిన లుక్‌ను రియాకపూర్ స్టైల్ చేశారు. ఈ ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. మనీష్ మల్హోత్రా ఈ బట్టలను డిజైన్ చేశారు.