ఉదయం రాజీనామా సాయంత్రం ఆమోదం…!
రాజ్యసభకు రాజీనామా చేసిన వైసిపి నేతలు మోపిదేవి వెంకట రమణ,బీద మస్తాన్ రావు రాజీనామాలను ఉప రాష్ట్రపతి ఆమోదించారు.

రాజ్యసభకు రాజీనామా చేసిన వైసిపి నేతలు మోపిదేవి వెంకట రమణ,బీద మస్తాన్ రావు రాజీనామాలను ఉప రాష్ట్రపతి ఆమోదించారు. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నట్లు రాజ్యసభ బులిటెన్ విడుదల చేసింది. ఈ రోజు మధ్యాహ్నం వెంకటరమణ ,మస్తాన్ రావు రాజీనామా చేసారు.
పార్లమెంట్ లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ కు రాజీనామా పత్రాలను అందించారు. అటు వైసీపీకి కూడా ఈ ఇద్దరూ రాజీనామాలు చేసారు. ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. ఏపీ అసెంబ్లీలో బలం రీత్యా ఎన్డీయే కూటమికి రెండు రాజ్యసభ స్థానాలు దక్కుతాయి.