రేవంత్ సీఎం.. భట్టి డిప్యుటీ ! కాంగ్రెస్ మంత్రులు వీళ్లేనా
చిట్టచివరికి ఎగ్జిట్ పోల్సే నిజమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ హస్తగతమైంది. కొత్త ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేయబోతోంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం, మంత్రులు ప్రమాణస్వీకారం చేసేందుకు ఏర్పాట్లు కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈమేరకు కాంగ్రస్ పార్టీ ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఇక కాంగ్రెస్‌లో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయి అనే విషయం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మారింది.
చిట్టచివరికి ఎగ్జిట్ పోల్సే నిజమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ హస్తగతమైంది. కొత్త ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేయబోతోంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం, మంత్రులు ప్రమాణస్వీకారం చేసేందుకు ఏర్పాట్లు కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈమేరకు కాంగ్రస్ పార్టీ ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఇక కాంగ్రెస్‌లో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయి అనే విషయం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మారింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి సీఎం, భట్టి విక్రమార్క డిప్యుటీ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. ఇక రేవంత్ కేబినేట్‌లో ములుగు ఎమ్మెల్యే సీతక్కకు కీలక పదవి ఇచ్చే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్‌లో గెలిచిన 65 మందిలో దాదాపు 10 మందికి మంత్రిగా అవకాశ వచ్చే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరికి మంత్రి పదవి దక్కే చాన్స్ ఉంది. దీంతో పాటు వివేక్ బ్రదర్స్‌లో కూడా ఒకరిని పదవి వరించబోతున్నట్టు తెలుస్తోంది.
ఖమ్మం జిల్లా నుంచి పొంగులేటి శ్రీనివాస్, తుమ్మల నాగేశ్వర్ రావు ఇద్దరిలో ఒకరి మంత్రి పదవి రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుకు కూడా కీలక పదవులు దక్కబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్‌లో చాలా కాలంగా కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్‌కు కూడా మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది. సీనియర్ నేత జీవన్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర రాజనరసింహకు కూడా కేబినెట్‌లో చోటు దక్కుతుందని టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే సీనియర్ రాజకీయ నేతలకు అడ్డా. మంత్రి పదవి తీసుకునే అర్హత ఉన్న నేతలు చాలా మంది ఉన్నారు. ఒకవేళ కేబినెట్‌లో చోటు దక్కకపోతే.. వాళ్లకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి కాంగ్రెస్‌లో ఎవరెవరు మంత్రులు కాబోతున్నారో.