నాగార్జున సాగర్ వివాదంపై CEO చర్య తీసుకోవాలి: రేవంత్ రెడ్డి
నాగార్జున సాగర్ వివాదంపై రేవంత్ స్పందించారు. పోలింగ్ కు కొన్ని గంటల ముందు సీఎం కేసీఆర్ ఈ కుటిల ప్రయత్నంతో సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
నాగార్జున సాగర్ వివాదంపై CEO చర్య తీసుకోవాలి: రేవంత్ రెడ్డి
Revanth Reddy on Nagarjuna Sagar : నాగార్జున సాగర్ వివాదానికి సంబంధించి సీఈఓ వికాస్ రాజ్ చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎవరు, ఎందుకు, ఏం ఆశించి ఈ వివాదం సృష్టిస్తున్నారో ప్రజలకు తెలుసు అన్నారు. కావాలనే వ్యూహాత్మకంగా పోలింగ్ టైమ్ కి కొన్ని గంటల ముందు ఈ వివాదం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. సెంటిమెంట్స్ రెచ్చగొట్టేందుకు సీఎం కేసీఆరే ఉద్దేశ్యపూర్వకంగా ఈ వివాదం సృష్టించారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. సాగర్ డ్యామ్ అక్కడే ఉంటుంది… నీళ్ళు ఎక్కడికీ పోవు… ఏ రాష్ట్రంతో సమస్య ఉన్నా సామరస్యంగా పరిష్కరించుకుంటామని అన్నారు. పోలింగ్ రోజు ఇలాంటి ఘటనలకు తెరలేపారు. తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ఏం ఆశించి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందన్నారు రేవంత్. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు… తొమ్మిదిన్నరేళ్లుగా కేసీఆర్ ఈ సమస్యను పరిష్కరించకపోవడంవల్లే ఇలాంటి ఘటనలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోపించారు. వీటన్నింటికి శాశ్వత పరిష్కారం ప్రజామోదయోగ్యమైన ప్రభుత్వం ఏర్పడటమే అన్నారు రేవంత్ రెడ్డి. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇతర రాష్ట్రాలతో ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తామని చెప్పారు. దేశాల మధ్య నీటి వాటాలు పంచుకుంటున్నాం.. అలాంటిది రాష్ట్రాల మధ్య వాటాలు పంచుకోలేమా..అని ప్రశ్నించారు పీసీసీ ఛీఫ్. నీటి వాటాలు, ఆస్తుల పంపకాల విషయంలో కాంగ్రెస్ సమయస్ఫూర్తితో, సమన్వయంతో వ్యవహరిస్తుందన్నారు. అవసరమైనప్పుడు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారు. రాజకీయ లబ్ది కోసం చేస్తున్న కేసీఆర్ పన్నాగాలు ఫలించవు…కేసీఆర్ వి దింపుడు కల్లం ఆశలే అన్నారు రేవంత్. ఇలాంటి కుట్రలు ఎన్నికలపై ప్రభావం చూపాల్సిన అవసరం లేద… వివాదాలను సామరస్యంగా సరైన పరిష్కారం చూపించే బాధ్యత మాది అని హామీ ఇచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
ఇది కేసీఆర్ డ్రామా : కోమటిరెడ్డి
సాగర్ డ్యాం పై పోలీసుల డ్రామా కేసీఆర్ పనే అని మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఓడిపోతున్నారని కేసీఆర్ కి అర్థమై తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్నాడని ఆరోపించారు. ఇన్ని రోజులు లేని హడావిడి పోలింగ్ రోజే ఎందుకు అవుతోంది? తెలంగాణ, ఏపీ పోలీసులు కలిసి చేసే డ్రామాలు ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఎన్నికల కోసం వాడుతున్నారని విమర్శించారు కోమటిరెడ్డి.