REVANTH REDDY: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే..
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని తెలంగాణ సీఎంగా ప్రకటించింది అధిష్టానం. ఈ మేరకు కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి కేసీ వేణు గోపాల్ ఈ అంశంపై ప్రకటన చేశారు. సోమవారం జరిగిన సీఎల్పీ మీటింగ్‌లో సభ్యులంతా రేవంత్‌ను సీఎంగా ఎన్నుకున్నట్లు వేణు గోపాల్ తెలిపారు.

Revanth Reddy as Telangana CM.. From student leader to CM..
REVANTH REDDY: తెలంగాణ సీఎం అభ్యర్థి ఎవరు అనే సస్పెన్స్‌కు తెరపడింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని తెలంగాణ సీఎంగా ప్రకటించింది అధిష్టానం. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ ఈ అంశంపై మంగళవారం సాయంత్రం ప్రకటన చేశారు. సోమవారం జరిగిన సీఎల్పీ మీటింగ్‌లో సభ్యులంతా రేవంత్‌ను సీఎంగా ఎన్నుకున్నట్లు వేణు గోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీలో వేణుగోపాల్ మాట్లాడారు. “సీనియర్లు అందరికీ న్యాయం జరుగుతుంది. గురువారం రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందరూ కలిసి ఒక టీంగా పని చేస్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తాం” అని కేసీ వేణుగోపాల్ అన్నారు. మరోవైపు అధిష్టానం రేవంత్ రెడ్డిని ఢిల్లీ రమ్మని పిలిచింది. దీంతో హుటాహుటిన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి సీనియర్ లీడర్లు ఢిల్లీలోనే ఉన్నారు.