Lok Sabha in-charges : లోక్ సభ ఇంఛార్జిలుగా తప్పుకున్న సీఎం రేవంత్ రెడ్డి, భట్టి.. ఓటమి భయంతో ఇంఛార్జిల మార్పు..?
3 నెలల్లో లోక్ సభ కాంగ్రెస్ ఇంఛార్జిల మార్పు! చేవెళ్ల, మహబూబ్ నగర్ స్థానాల ఇంఛార్జి నుండి తప్పుకున్న సీఎం రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాల ఇంఛార్జి నుండి తప్పుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

Revanth Reddy, Bhatti who left as Lok Sabha in-charges.. Change of in-charges due to fear of defeat..?
తెలంగాణతో పాటుగా దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపో లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహాలు రచిస్తోంది. ఈ సందర్భంగానే ఏఐసీసీ అధిష్టానం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమించింది. దీంతో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ ఉత్తర్వులు జారీ చేసింది.
3 నెలల్లో లోక్ సభ కాంగ్రెస్ ఇంఛార్జిల మార్పు!
చేవెళ్ల, మహబూబ్ నగర్ స్థానాల ఇంఛార్జి నుండి తప్పుకున్న సీఎం రేవంత్ రెడ్డి.
సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాల ఇంఛార్జి నుండి తప్పుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇంఛార్జిలుగా ఉన్న చోట ఓడిపోతే పరువు పోతుందని తప్పుకున్నారు అంటూ విమర్శలు.
లోక్ సభ ఎన్నికల సమీపిస్తున నేపథ్యంలో డిసెంబర్ నెలలోనే పార్లమెంట్ వారీగా నియోజక వర్గాల ఇంఛార్జిలను నియమించిన కాంగ్రెస్ పార్టీ.. ఇలా నియమించి మూడు నెలలు కాకముందే ఇంఛార్జిలను కాంగ్రెస్ మార్చేసింది. గత డిసెంబర్ లో రిలీజ్ చేసిన ఇంఛార్జి లిస్టులో చేవెళ్ల, మహబూబ్ నగర్ నియోజకవర్గాలను సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించింది. సికింద్రాబాద్, హైదారాబాద్ పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జిగా భట్టి విక్రమార్క నియమించింది. ఈ నాలుగు నియోజకవర్గాల నుంచి సీఎం, ఢిప్యూటీ సీఎంలు తప్పుకున్నారు.
తాజాగా విడుదలైన లిస్టులో వారు ఆయా స్థానాల నుండి తప్పుకున్నారు. కాగా వారిస్థానాలను మరో వ్యక్తులకు కేటాయించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి పని చేస్తున్న వారిని కాదని అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో జాయిన్ అయిన రేవూరి ప్రకాష్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావులకు వరంగల్, మల్కాజ్ గిరి ఇంఛార్జిగా నియమించిన టీపీసీసీ.
తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జిలను నియమించిన అధిష్టానం..
ఇందులో అత్యధికంగా 9 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఏఐసీసీ ఇంఛార్జి రోహిత్ చౌదరి ప్రాతినిథ్యం వహించనున్నారు. 8 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఏఐసీసీ ఇంఛార్జి పీసీ విష్ణు నాథ్ ప్రాతినిథ్యం వహించనున్నారు.
- నియోజకవర్గాల వారిగా.. ఇంఛార్జిలు..
ఖమ్మం – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నల్లగొండ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
కరీంనగర్ – పొన్నం ప్రభాకర్
పెద్దపల్లి – దుద్దిల్ల శ్రీధర్ బాబు
వరంగల్ – రేవూరి ప్రకాశ్ రెడ్డి
మహబూబాబాద్ – తుమ్మల నాగేశ్వర రావు
హైదరాబాద్ – ఒబెద్దుల్ల కొత్వాల్
సికింద్రాబాద్ – కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
భువనగిరి – కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి
నాగర్ కర్నూల్ – జూపల్లి కృష్ణ రావు
మహబూబ్ నగర్ – సంపత్ కుమార్
చేవెళ్ల – వేం నరేందర్ రెడ్డి
మల్కాజిగిరి – మైనపల్లి హనుమంత్ రావు
మెదక్ – కొండ సురేఖ
నిజామాబాద్ – పీ. సుదర్శన్ రెడ్డి
ఆదిలాబాద్ – అనసూయ సీతక్క
జహీరాబాద్ – దామోదర రాజనర్సింహా
3 నెలల్లో లోక్ సభ కాంగ్రెస్ ఇంఛార్జిల మార్పు!
చేవెళ్ల, మహబూబ్ నగర్ స్థానాల ఇంఛార్జి నుండి తప్పుకున్న సీఎం రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాల ఇంఛార్జి నుండి తప్పుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. #TelanganaCongress #BRS #parliamentelections2024 #GeneralElections pic.twitter.com/KJXqziGDNk— Dial News (@dialnewstelugu) April 1, 2024
SURESH.SSM