REVANTH REDDY: బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కోతలు.. ఆ బిల్లులు మీరు కట్టిస్తారా: రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో విద్యుత్ బకాయిలు చెల్లించని వాటిలో సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. మొదటి స్థానంలో సిద్దిపేట 61.37 శాతం బకాయిలున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 21, 2023 | 06:02 PMLast Updated on: Dec 21, 2023 | 6:02 PM

Revanth Reddy Comments On Brs And Akbaruddin Owaisi

REVANTH REDDY: బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ కోతలున్నాయని, రైతులు విద్యుత్ కోసం రోడ్డెక్కారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో విద్యుత్‌ అంశంపై సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, అక్బరుద్దీన్‌పై విమర్శలు గుప్పించారు. “రాష్ట్రంలో విద్యుత్ బకాయిలు చెల్లించని వాటిలో సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. మొదటి స్థానంలో సిద్దిపేట 61.37 శాతం బకాయిలున్నాయి. రెండో స్థానంలో గజ్వేల్ 50.29 శాతం బకాయిలు, మూడో స్థానంలో హైదరాబాద్ సౌత్ 43 శాతం బకాయి ఉంది.

Mudragada Padmanabham : త్వరలో వైసీపీ లోకి ముద్రగడ.. పవన్ పై నిలబడతాడా ?

సిద్దిపేటలో హరీష్ రావు, గజ్వెల్‌లో కేసీఆర్, హైదరాబాద్ సౌత్‌లో అక్బరుద్దీన్ బకాయిలు చెల్లించే బాధ్యత తీసుకోవాలి. బీఆరెస్ పాలనలో రాష్ట్రంలో విద్యుత్ కోతలే లేవన్నట్లు జగదీష్ రెడ్డి మాట్లాడారు. రైతులు రోడ్డెక్కారా అని జగదీష్ రెడ్డి అడిగారు. కామారెడ్డిలో సెప్టెంబర్ 1న సబ్ స్టేషన్‌లు ముట్టడి చేసి రైతులు నిరసన తెలిపిన సంగతి ఆయనకు గుర్తుచేస్తున్నా. సూర్యాపేట జిల్లా నెరేడుచర్లలో రైతులు రోడ్డెక్కింది బీఆరెస్ పాలనలోనే. కరెంటు సరిగా లేక, పంటలు దక్కక కొమురయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నది బీఆరెస్ పాలనలోనే. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆనాడు శ్రీశైలం విద్యుత్ సొరంగం బ్లాస్ట్ అయి 9 మంది మరణించారు. ప్రమాదంలో ఫాతిమా అనే అమ్మాయి చనిపోతే కాంగ్రెస్ ఆదుకుంది. కానీ, ఆనాటి సీఎం, విద్యుత్ శాఖ మంత్రి కనీసం ఆ కుటుంబాలను పరామర్శించలేదు.

బీఆరెస్ ప్రభుత్వం దుర్మార్గాలను సభలో ఎంఐఎం కనీసం ప్రస్తావించలేదు. తన పాత స్నేహితుడిని రక్షించుకునేందుకు అక్బరుద్దీన్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారితో స్నేహం ఎంఐఎంకు మంచిది కాదు. మైనారిటీల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్దిని శంకించాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ హయాం నుంచి కేసీఆర్ హయాం వరకు ఎవరు ఎవరితో దోస్తీ చేశారో అందరికీ తెలుసు. ఆ అంశంపై చర్చించాలంటే మరోసారి చర్చిద్దాం. ఇప్పుడు విద్యుత్ రంగంపై శ్వేతపత్రంపై చర్చిద్దాం” అని రేవంత్ అన్నారు.