REVANTH REDDY: పల్లి బఠానికి గ్రూప్స్ పేపర్లు అమ్ముకున్నారు.. కల్వకుంట్ల కుటుంబానికే పదవులు: రేవంత్

ఉద్యమంలో అమరులైన కుటుంబాలను తొమ్మిదిన్నర ఏండ్లలో ప్రగతి భవన్ పిలిచారా. వాళ్ళ త్యాగం గుర్తించారా..? కేసీఆర్.. ఏనాడైనా అమరుల కుటుంబాలకి బుక్కెడు బువ్వ పెట్టారా..? ఆయన కుటుంబంలో అందరికి మంత్రి పదవులు ఇచ్చాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 16, 2023 | 06:31 PMLast Updated on: Dec 16, 2023 | 6:32 PM

Revanth Reddy Criticised Brs And Ktr In Assembly

REVANTH REDDY: సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఇండ్ల జాగా తీసుకున్నారని విమర్శించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. గ్రూప్స్ పేపర్స్‌ను పల్లి బఠానికి అమ్ముకున్నారని బీఆర్ఎస్‌ను ఎద్దేవా చేశారు రేవంత్. శనివారం ఆయన శాసన సభ, శాసన మండలిలో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌పై, కేటీఆర్‌పై నిప్పులు చెరిగారు. “ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీ అని చెప్పుకుంటారు. ఉద్యమంలో అమరులైన కుటుంబాలను తొమ్మిదిన్నర ఏండ్లలో ప్రగతి భవన్ పిలిచారా.

KTR Vs REVANTH REDDY: అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేటీఆర్.. విరుచుకుపడ్డ సీఎం

వాళ్ళ త్యాగం గుర్తించారా..? కేసీఆర్.. ఏనాడైనా అమరుల కుటుంబాలకి బుక్కెడు బువ్వ పెట్టారా..? ఆయన కుటుంబంలో అందరికి మంత్రి పదవులు ఇచ్చాడు. పేగు బంధం ఉన్నవాళ్లకు పదవులు ఇచ్చారు. కానీ ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఏం చేశారు..? కరోన మందుల్ని బ్లాక్ మార్కెట్‌లో అమ్మైకున్న వాళ్లను రాజ్యసభ పంపిన చరిత్ర మీది. మీరు వచ్చి మా టికెట్ల గురించి మట్లాడుతున్నారు. నళిని డీఎస్పీగా ఉండి.. తెలంగాణ కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. నళినిని పిలిచి ఉద్యోగం ఇస్తా రండి అని చెప్పారా..? నళినికి న్యాయం జరగలేదు. కానీ, కూతురు నిజామాబాద్‌లో ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీ ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్. తెలంగాణా ఉద్యమకారులపై కేసులు ఎత్తివేశారా..? కేసీఆర్ కుటుంబ సభ్యులపై ఉన్న కేసులు ఎన్ని..? ఉద్యమ కారులపై ఉన్న కేసులు ఎన్ని అని కేసీఆర్ ఎప్పుడైనా సమీక్ష చేశారా..? బీఆర్ఎస్ ఉద్యమాల పార్టీ. కానీ, ధర్నా చౌక్ ఎత్తేసి, నిర్బంధ రాష్ట్రం చేయలేదా..?

REVANTH Vs HARISH: పోతిరెడ్డిపాడుపై అసెంబ్లీలో రచ్చ.. హరీష్ వర్సెస్ రేవంత్.. మాటల యుద్ధం

ధర్నా చౌక్ ఎత్తేసిన దుర్నీతి మీది. ధర్నా చౌక్ పునరుద్దరిస్తే అభినందించాల్సినది పోయి అడ్డుపడుతున్నారు. మేము ఓపెన్ చేసిన ధర్నా చౌక్‌లో కేటీఆర్ ఆమరణ నిరాహారదీక్ష చేస్తే బాగుంటుంది. ఎమ్మెల్యేలు.. అన్నా మాకు స్వేచ్ఛ వచ్చింది అంటున్నారు. మా ఫోన్‌లు స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నాం అని చెప్తున్నారు. స్వేచ్ఛ అంటే అదే కదా. రైతు బీమా లెక్కల ప్రకారం లక్షల మంది చనిపోయారు. రైతు న ఆదుకోవడానికి పథకాలు ఉండాలి. చనిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చుడు కాదు. రైతు చావుకు ఐదు లక్షలు వెల కట్టింది మీరు. మళ్లీ సిగ్గులేకుండా మట్లాడుతున్నారు. కేసీఆర్ వరి పంట అద్భుతం అన్నాడు. రైతులను ఆదుకోండి అని ఒత్తిడి చేస్తే.. వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అన్నాడు కేసీఆర్. తన ఫార్మ్ హౌస్‌లోని 150 ఎకరాల్లో కేసీఆర్ మాత్రం వరి పండించాడు. పేద రైతులకు క్విటాలుకు 1960 రూపాయలు ఇవ్వలేదు. కానీ కేసీఆర్ ఫార్మ్ హౌస్‌లో పండించిన పంటకు రూ.4250 ఇచ్చారు. ఎవరు ఇచ్చారు..? ఎందుకు ఆ ధర ఇచ్చారో విచారణ చేయమని అంటారా..? నేను రెడీ విచారణ చేయడానికి..? విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో లేదు.

అబద్ధాల పునాదుల మీద ఎదిగిన పార్టీ బీఆర్ఎస్. తలసరి వినియోగంలో తెలంగాణ 10వ స్థానంలో ఉంది. కాలువతో నీళ్లు రైతులకు ఇచ్చి ఉంటే 29 లక్షల పంపు సెట్లు ఎలా పెరిగాయి..? ఎంపీ సంతోష్ కూడా ఇండ్ల జాగా తీసుకున్నాడు. వాళ్ళ సోదరి కూడా ఆర్అండ్ఆర్ ప్యాకేజిలో ఇండ్ల పట్టాలు తీసుకుంది. ఇసుక దోపిడీలో మీ వాటా లేదా..? ఇంటర్ పరీక్ష పత్రాలు సరిగ్గా దిద్దలేని వాళ్ళు మీరు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకు చేసిన వాళ్ళు వాటాల్లో తేడాలతో బయట పడింది. నిరుద్యోగులకు మీరిచ్చే సమాధానం ఏంటి..? పల్లి బఠానికి పేపర్‌లు అమ్ముకున్నారు. మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు..? తప్పు జరిగింది. మూడో సారి వస్తే నిండా ముంచుతాం అని చెప్పిండు. తప్పు జరిగింది అని చెప్పినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు..? మేనేజ్మెంట్ కోటాలో వస్తే ఇదే సమస్య. చట్టం సభలో చేస్తారు. కనీసం తెలుసుకోవాలి. ఆరు గ్యారంటీలపై చట్టబద్దత ఇక్కడే చేస్తాం. సీపీఎం, ఎంఐఎం అభిప్రాయాలు కూడా తీసుకుంటాం” అని రేవంత్ విమర్శించారు.