REVANTH REDDY: దొరల తెలంగాణ కావాలో.. ప్రజా తెలంగాణ కావాలో తేల్చుకోండి: రేవంత్ రెడ్డి
పదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ప్రజల్ని నమ్మించి మోసం చేసిన కేసీఆర్.. మళ్లీ మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని వస్తుండు. పదేళ్లు అధికారంలో ఉన్నా బీఆరెస్ మేడ్చల్‌కు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇవ్వలేదు.
REVANTH REDDY: పేదల ప్రభుత్వం రావాలంటే దొరల రాజ్యం కూలాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దొరల తెలంగాణ కావాలో.. ప్రజా తెలంగాణ కావాలో తేల్చుకోవాలన్నారు. గురువారం రేవంత్ రెడ్డి మేడ్చల్‌లో జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై విమర్శలు సంధించారు. “పదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ప్రజల్ని నమ్మించి మోసం చేసిన కేసీఆర్.. మళ్లీ మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని వస్తుండు. పదేళ్లు అధికారంలో ఉన్నా బీఆరెస్ మేడ్చల్‌కు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇవ్వలేదు.
Congress Manifesto: కాంగ్రెస్ మేనిఫెస్టో రెడీ.. కీలక హామీలివే..!
జవహర్ నగర్ ప్రజలకు డంపింగ్ యార్డు బాధ పోలేదు. మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప బీఆరెస్ చేసిందేం లేదు. పదేళ్ల బీఆరెస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. పేదల ప్రభుత్వం రావాలంటే దొరల రాజ్యం కూలాలి. ఇవి దొరల తెలంగాణకు.. ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. దొరల తెలంగాణ కావాలో.. ప్రజా తెలంగాణ కావాలో తేల్చుకోండి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్.. మహిళలకు ప్రతీ నెలా రూ.2500 అందిస్తాం. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు సాయం అందిస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తాం.
ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ నెలా రూ.4వేలు అందిస్తాం. ఆడబిడ్డ పెళ్లికి రూ.1లక్షతో పాటు తులం బంగారం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. మేడ్చల్ కు డిగ్రీ కాలేజీ, వందపడకల హాస్పిటల్ తెచ్చే బాధ్యత మాది” అని రేవంత్ వ్యాఖ్యానించారు.