REVANTH REDDY: ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్లు జైల్లో చిప్పకూడు తింటారు.. కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
ఫోన్ ట్యాపింగ్ జరిగితే జరిగుండొచ్చని, ఒకరిద్దరి ఫోన్లు ట్యాపింగ్ చేస్తే ఏమవుతుందనేలా కేటీఆర్ మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏమవుతుందని కేటీఆర్ మాట్లాడుతున్నారని, అలాంటివాళ్లు చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటారని రేవంత్ అన్నారు.

REVANTH REDDY: తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏమవుతుందని కేటీఆర్ మాట్లాడుతున్నారని, అలాంటివాళ్లు చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటారని రేవంత్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ జరిగితే జరిగుండొచ్చని, ఒకరిద్దరి ఫోన్లు ట్యాపింగ్ చేస్తే ఏమవుతుందనేలా కేటీఆర్ మాట్లాడారు. అవసరమైతే విచారణ జరిపించుకోవచ్చన్నారు.
PAWAN KALYAN: జనంలోకి జనసేనాని.. వారాహి యాత్ర షెడ్యూల్ విడుదల
కేటీఆర్ వ్యాఖ్యలపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్‌ను కేటీఆర్ అంగీకరించాడని కాంగ్రెస్ సహా వివిధ పార్టీల నేతలన్నారు. చేసిన పనిని సమర్ధించుకునేలా ఆయన మాటలున్నాయన్నారు. ఇక.. కేటీఆర్ వ్యాఖ్యలపై శుక్రవారం రేవంత్ స్పందించారు. ”గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేసి భయపెట్టింది. భార్యాభర్తలు ఏం మాట్లాడుకున్నారో కూడా విన్నారు. ట్యాపింగ్ చేసి వింటే ఏమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఆయన బరితెగించి, తాగుబోతులా మాట్లాడుతున్నారు. ఫోన్ల సంభాషణ విన్నాం. వింటే ఏమవుతుందని సిగ్గు లేకుండా చెబుతున్నారు. అలా ఫోన్ సంభాషణ వింటే, చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు. ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోంది. తప్పకుండా చర్యలు ఉంటాయి. అధికారులకు ఆ రోజే చెప్పా. వినలేదు. ఇవాళ జైలుకు వెళ్తే.. అటు వైపు ఎవరూ చూడటం లేదు” అని రేవంత్ అన్నారు.
కాంగ్రెస్ పాలనపై కూడా రేవంత్ స్పందించారు. ”కేసీఆర్ పాలనకు భిన్నంగా నేడు ప్రజలు సచివాలయానికి వెళ్లి సమస్యలు చెప్పే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవబోతోంది. ఎంపీ ఎన్నికల్లో పాలమూరులో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోంది. మహబూబ్ నగర్ జిల్లాకు డీకే ఆరుణ ఏం సాధించారు. పాలమూరు ప్రాజెక్టుకు ఆమె జాతీయ హోదా తీసురావచ్చు కదా! పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఏకం అయ్యారు. ఎవరు ఏ సమస్యతో వచ్చిన.. వాటి పరిష్కారం కోసం పని చేస్తున్నాం. దిల్లీలో మన పరిపాలనను అభినందిస్తున్నారు” అని రేవంత్ అన్నారు.