REVANTH REDDY: తెలంగాణ విషయంలో కేంద్రం నిర్లక్ష్యం.. ఫిబ్రవరి 2 నుంచి ప్రచార సభలు: రేవంత్ రెడ్డి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. రాష్ట్ర ప్రయోజనాలను ఏనాడూ కేంద్రాన్ని అడగలేదు. అందుకే కేంద్రం ఇవ్వలేదు. మోదీ ప్రధాని అయ్యాక ఏకంగా వంద లక్షల కోట్ల అప్పులు చేశారు. మణిపూర్ విధ్వంసం జరిగితే కనీసం ఆ పర్యటనకు మోదీ వెళ్లలేదు.
REVANTH REDDY: తెలంగాణ ప్రజల హక్కుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు. “రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీల గురించి కేంద్రం పట్టించుకోలేదు. నల్లధనం తీసుకొచ్చి పేదోడి ఖాతాలో వేస్తామన్నారు. చిల్లిగవ్వ కూడా వేయలేదు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. పెట్టుబడి రాక.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా హక్కులను కాపాడలేదు.
YS SHARMILA: ప్రధాని మోదీకి షర్మిల లేఖ.. విభజన హామీలు నెరవేర్చాలని వినతి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. రాష్ట్ర ప్రయోజనాలను ఏనాడూ కేంద్రాన్ని అడగలేదు. అందుకే కేంద్రం ఇవ్వలేదు. మోదీ ప్రధాని అయ్యాక ఏకంగా వంద లక్షల కోట్ల అప్పులు చేశారు. మణిపూర్ విధ్వంసం జరిగితే కనీసం ఆ పర్యటనకు మోదీ వెళ్లలేదు. కానీ, రాహుల్ గాంధీ మాత్రం మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకూ భారత్ జోడో న్యాయ యాత్ర చేపడుతున్నారు. రాహుల్ గాంధీ అవసరం దేశానికి చాలా అవసరం ఉంది. ఆయన ప్రధాని అవ్వాలంటే.. తెలంగాణలో అన్ని పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు అప్పగించాం. అందుకోసం సెలక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేశాం. పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా సభలు నిర్వహించి ముందుకు పోవాలి. ప్రజల్లోకి వెళ్లేందుకు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి సభలు నిర్వహిస్తున్నాం.
ఈ నెల 2వ తేదీన ఇంద్రవెళ్లిలో సభ ఉంది. నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలి. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లే. బీఆర్ఎస్‌ను, బీజేపీని నిలువరించేది కాంగ్రెస్ పార్టీనే. రాజకీయ కుట్రతో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకున్నారు. కేసీఆర్ దొడ్లో చెప్పులు మోసేవారితో ప్రొఫెసర్ కోదండరామ్‌ను పోల్చుతున్నారు. కోదండరాం గొప్పదనాన్ని ప్రశ్నించడం.. బీఆర్ఎస్ పార్టీ భావదారిద్య్రాన్ని చాటుతోంది’’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.