Revanth Reddy: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రజా పాలన అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు..
ప్రజా పాలనను సమర్ధవంతంగా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఈ పథకం అమలు కోసం సీఎం రేవంత్ రెడ్డి.. కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. ఈ కేబినెట్ సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా ఉంటారు.
Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రజా పాలనలో దరఖాస్తుల ప్రక్రియ ఇటీవలే ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రజా పాలనను సమర్ధవంతంగా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఈ పథకం అమలు కోసం సీఎం రేవంత్ రెడ్డి.. కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. ఈ కేబినెట్ సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా ఉంటారు.
REVANTH VS NANI: కొడాలి నానిని రానీయొద్దు! నో ఎంట్రీ అంటున్న రేవంత్..
ఆయనతోపాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు తెలంగాణ సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తులపై రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రజా పాలన దరఖాస్తుల విషయంలో డేటా ఎంట్రీలో తప్పులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అయితే, డేటా ఎంట్రీకి ఈ నెల చివరి వరకు సమయం కావాలని అధికారులు కోరారు. సమీక్షా సమావేశం అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 40 రోజుల్లో నెరవేరుస్తామని ఎక్కడా చెప్పలేదని, 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం 30 వేల మంది ఆపరేటర్లతో ప్రజా పాలన దరఖాస్తులకు సంబంధించిన డేటా ఎంట్రీ ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు.
అభయ హస్తం హామీల అమలుకు సంబంధించి 1.05 కోట్ల దరఖాస్తులు వచ్చాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు విజయవంతంగా పూర్తి చేశారని, ప్రతి గ్రామం నుంచి దరఖాస్తులు స్వీకరించామని చెప్పారు. ఈ ఆరు గ్యారంటీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ జరిగిన పది రోజుల్లో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. ఈ దరఖాస్తులనన్నింటినీ జనవరి 17వ తేదీలోగా డేటా ఎంట్రీని పూర్తి చేయాలని సంబంధిత కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.