రుణమాఫీపై రేవంత్ పక్కా ప్లాన్…? యాప్ అందుకేనా…!
తెలంగాణాలో రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపధ్యంలో ఇప్పుడు జాగ్రత్తగా అడుగులు వేస్తోంది రేవంత్ సర్కార్.
తెలంగాణాలో రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపధ్యంలో ఇప్పుడు జాగ్రత్తగా అడుగులు వేస్తోంది రేవంత్ సర్కార్. నేటి నుంచి యాప్ ద్వారా రెండు లక్షల లోపు రుణమాఫీ కానీ రైతు వివరాలను సేకరిస్తారు. రుణమాఫీ జరగని ప్రతి రైతు వద్దకు వెళ్లనున్న వ్యవసాయ అధికారులు వారి వివరాలను తీసుకుని యాప్ లో అప్లోడ్ చేస్తారు.
రెండు లక్షల లోపు రుణమాఫీ కానీ రైతుల కొరకు రైతు భరోసా పేరుతో ఆప్ డిజైన్ చేసారు. 25 26 రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా యాప్ ను టెస్ట్ చేసారు. ఆగస్టు 15 నాటికి 22,37,848 లక్షల రైతులకు రెండు లక్షల రూపు రుణమాఫీ జరిగింది. గ్రామాల వారీగా ప్రణాళికలను తయారు చేసి దాని ప్రకారం యాప్ లో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేస్తారు. బ్యాంక్ లలో తప్పుగా 1,24,604 రైతుల ఆధార్ వివరాలు నమోదు అయ్యాయి. ఇప్పటికే 41,340 ఆధార్ వివరాలు సవరించారు.