Pocharam Srivas Reddy : కాంగ్రెస్ లోకి మాజీ స్పీకర్ పోచారం.. ఇంటికెళ్లి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్.. బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించేందుకు పోచారం ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.

Revanth Reddy invited former speaker to Congress.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్.. బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించేందుకు పోచారం ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి. కాసేపటి క్రితమే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పోచారం ఇంట్లో భేటి అయిన సీఎం రేవంత్ రెడ్డి. ఈ భేటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి రావాలని శాసనసభ మాజీ స్పీకర్, బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించలేదని సమాచారం.. నేడో, రేపో ఆయన హస్తం కండువా కప్పుకుంటారని సమాచారం.. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో ఆయన పలు మార్లు మంతనాలు జరపారని సమాచారం..