Revanth Reddy: రేవంత్ రెడ్డి భారీ స్కెచ్.. ఆ స్థానాలన్నీ కాంగ్రెస్‌కేనా..
కాంగ్రెస్ గెలుపు కోసం రేవంత్ రెడ్డి అనేక వ్యూహాలు రచిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయ్. కొన్ని నెలల్లో ఎన్నికలు రాబోతున్న వేళ.. పార్టీలన్నీ ఢీ అంటే ఢీ అంటున్నాయ్. నువ్వా నేనా అనే రేంజ్‌లో పోరాడుతున్నాయ్. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటలు.. తూటాలు మించి పేలుతున్నాయ్. రాబోయే ఎన్నికల్లో ప్రధాన పోటీ కారు, కాంగ్రెస్ మధ్యే ఉండే చాన్స్ ఉంది. దీంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 115 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ కొన్ని స్థానాలను ప్రకటించింది. కాస్త పోటీ ఎక్కువగా ఉండే స్థానాలను.. పూర్తిగా ఈ నెలలో ప్రకటించే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి ఆచితూచి ఆలోచించి ఈసారి పార్టీని ఎలాగైనా బలోపేతం చేయాలని చూస్తున్నారు.
అయితే కేసీఆర్‌కు మైండ్ బ్లాంక్ అయ్యేలా రేవంత్ రెడ్డి ఓ భారీ స్కెచ్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన చాలామంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కేసీఆర్ మళ్లీ టికెట్లు కేటాయించారు. ఐతే కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన స్థానాలను ఎలాగైనా ఈసారి హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఆయా స్థానాలలో బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని వ్యూహాత్మక ఆలోచన చేసినట్టు సమాచారం. ముఖ్యంగా కాంగ్రెస్‌కు హ్యాండిచ్చిన ఎమ్మెల్యేలలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డితో పాటు.. సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, గండ్ర వెంకటరమణారెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు.
వీరంతా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి.. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ 12స్థానాల్లో ఈసారి ఎలాగైనా గట్టి అభ్యర్థులను నిలబెట్టి 12కు 12 కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం అన్ని రకాల కసరత్తులు రెడీ చేసి పెట్టింది. తప్పనిసరిగా ఆ నియోజకవర్గాల జనాలు కాంగ్రెస్ వైపు నిలుస్తారో లేదో చూడాలి మరి.