బీఆరెస్ ను బొంద పెట్టి… ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందాం: రేవంత్ రెడ్డి
ఏ అభివృద్ధీ చేయకుండా ఓట్లు అడగడానికి వచ్చే బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓటర్లకు పిలుపు ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంతో సంక్షేమ రాజ్యం వస్తుందని ఎన్నికల ప్రచారసభల్లో తెలిపారు
Revanth Reddy : పదేళ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చని BRS నేతలు మళ్ళీ గెలిపించాలని మిమ్మల్ని అడుగుతున్నారు… వాళ్ళని నమ్మొద్దని అన్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వస్తే కరెంటు, రైతు బంధు (Rythu bandhu) రాదని కేసీఆర్ (KCR) అంటుండు… ఆయన మతి తప్పి మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో తెలియడం లేదన్నారు. ఉచిత కరెంటు తెచ్చి రైతులను ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ ది. రైతులకు, కౌలు రైతులకు ఏటా ఎకరాకు రూ.15వేల రైతు బంధు అందిస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. రైతు కూలీలకు ఏటా రూ.12వేలు అందిస్తామనీ… వచ్చే నెల నుంచి పెన్షన్ రూ.4వేలు అందించే బాధ్యత కాంగ్రెస్ దని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు PCC చీఫ్. ఇందిరమ్మ (Indiramma) రాజ్యంలో పేదింటి ఆడబిడ్డల పెళ్లికి లక్ష రూపాయలతోపాటు తులం బంగారం అందిస్తామని చెప్పారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే దౌల్తాబాద్ లో అభివృద్ధి, సంక్షేమం జరిగింది. డబుల్ బెడ్రూం, దళితులకు మూడెకరాలు, కాలేజీలు తెస్తామని బీఆరేస్ నేతలు చెప్పిండ్రు. అన్ని మర్చిపోయారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. ఇల్లు లేని పేదలు ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు అందిస్తామని తెలిపారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పూర్తి కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు రేవంత్ రెడ్డి. బీఆరెస్ నాయకులు తమ ఊర్లని చెప్పుకునే గ్రామాలకు రోడ్లు వేయించింది మనమే అన్నారు. మిమ్మల్ని కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటే… మీరు నన్ను కడుపులో పెట్టుకుని చూసుకున్నారని అన్నారు రేవంత్ రెడ్డి.