REVANTH REDDY: రేవంత్ రెడ్డి వేట మొదలైంది..! విద్యుత్‌పై జ్యుడీషియల్ ఎంక్వైరీ..
విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన అక్రమాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో పాటు భద్రాద్రి, యాదాద్రి ప్రాజెక్టుల ఒప్పందాలపైనా ఎంక్వైరీ చేయిస్తామన్నారు.
REVANTH REDDY: తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సర్కార్ వేట మొదలైంది. పాత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టిపెట్టారు. విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన అక్రమాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో పాటు భద్రాద్రి, యాదాద్రి ప్రాజెక్టుల ఒప్పందాలపైనా ఎంక్వైరీ చేయిస్తామని ప్రకటించారు.
REVANTH REDDY: బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కోతలు.. ఆ బిల్లులు మీరు కట్టిస్తారా: రేవంత్ రెడ్డి
ఈ స్కామ్స్‌లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి రూ.10 వేల కోట్ల దాకా అవినీతికి పాల్పడ్డారని మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై కాంగ్రెస్ సర్కార్ శ్వేతపత్రం ప్రవేశపెట్టింది. బీఆర్ఎస్ హయాంలో డిస్కంలు రూ.81 వేల కోట్లు అప్పుల్లో ఉన్నాయనీ.. ప్రభుత్వ సంస్థలు, ఆఫీసులు 28 వేల కోట్లకు పైగా చెల్లించాల్సి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో వైట్ పేపర్ రిలీజ్ చేశారు. దేశంలోనే 24 గంటల విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని తప్పుడు ప్రకటనలతో జనాన్ని మభ్యపెట్టిందని భట్టి విమర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
Mudragada Padmanabham : త్వరలో వైసీపీ లోకి ముద్రగడ.. పవన్ పై నిలబడతాడా ?
యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో రూ.10 వేల కోట్లు తిన్నారని ఆరోపించారు. టెండర్లకు పిలవకుండా ఆర్డర్ ఇవ్వడమే పెద్ద కుంభకోణమని అన్నారు. ఇదే అంశంపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్‌తో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఒప్పందం చేసుకున్నారనీ, పవర్ వాడినా, వాడకున్నా డబ్బులు చెల్లించాలని ఎలా అగ్రిమెంట్ చేసుకుంటారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం విషయంలో సూపర్ క్రిటికల్ విధానం అమలు చేయాలని కేంద్రం చెప్పిందని, కానీ ఇండియా బుల్ కంపెనీ సబ్ క్రిటికల్ విధానంతో చేయడానికి ఎందుకు ఒప్పుకున్నారని రేవంత్ ప్రశ్నించారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ ఏడేళ్ళలో 6 కోట్లతో పూర్తి చేయాల్సి ఉండగా, రూ.9 కోట్లతో పూర్తి చేశారన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌లో అంచనాలు ఎందుకు పెరిగాయని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆరోపణలపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు.
జ్యుడీషియల్ విచారణకు సిద్ధం: జగదీశ్ రెడ్డి
జ్యుడీషియల్ ఎంక్వైరీకి తాము సిద్ధమన్నారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. తమ హయాంలో 24 గంటల విద్యుత్ ఇచ్చామనీ.. తెచ్చిన అప్పుతో ఎక్కడా నష్టం జరగలేదన్నారు. ఆస్తులు పెంచినట్టు చెప్పుకొచ్చారు జగదీశ్ రెడ్డి. తెచ్చిన అప్పుల్లో సగానికి పైగా తీర్చామన్నారు. అవసరమైతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించుకోవచ్చని జగదీశ్ రెడ్డి సవాల్ చేయడంతో దాన్ని అంగీకరిస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్ళు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్స్ నిర్మాణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామన్నారు. 24 గంటల విద్యుత్‌పై అఖిలపక్షంతో నిజ నిర్దారణ కమిటీ వేస్తున్నామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.