Revanth Reddy: ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ.. యువతకు రేవంత్ హామీ..

పేదలకు ఉద్యోగాలు ఇచ్చి, వారి కళ్లలో ఆనందం చూడాలనే నర్సులకు ఉద్యోగాలు ఇచ్చాం. ఆరోగ్య తెలంగాణ నిర్మించడంలో నర్సులదే కీలకపాత్ర. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఉన్నప్పటికీ.. ఆర్థిక భారం ఎక్కువ అయినప్పటికీ ఉద్యోగాలు ఇస్తున్నాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 31, 2024 | 08:11 PMLast Updated on: Jan 31, 2024 | 8:11 PM

Revanth Reddy Promise To Youth Of Fulfilling 2 Lakh Jobs In Telangana

Revanth Reddy: రాబోయే ఏడాదిలోగా తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అతి త్వరలోనే ఖాళీగా ఉన్న 15 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. హైదరాబాద్‌, ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. కొత్తగా ఎంపికైన 7,094 మంది స్టాఫ్‌ నర్సులకు రేవంత్ రెడ్డి నియామకపత్రాలు అందజేశారు. అనంతరం రేవంత్ మాట్లాడారు. “స్టాఫ్‌ నర్సుల నియామకం చాలా రోజులుగా పెండింగ్‌లో ఉంది.

YS SHARMILA: భద్రత కల్పించండి.. ఏపీ డీజీపీకి షర్మిల లేఖ

పేదలకు ఉద్యోగాలు ఇచ్చి, వారి కళ్లలో ఆనందం చూడాలనే నర్సులకు ఉద్యోగాలు ఇచ్చాం. ఆరోగ్య తెలంగాణ నిర్మించడంలో నర్సులదే కీలకపాత్ర. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఉన్నప్పటికీ.. ఆర్థిక భారం ఎక్కువ అయినప్పటికీ ఉద్యోగాలు ఇస్తున్నాం. ఎంతో మంది యువత, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాం. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటానికి కారణమే నిరుద్యోగ సమస్య. గత ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. గడిచిన పదేళ్లలో తెలంగాణ యువత ఆకాంక్షలు నెరవేరలేదు. తెలంగాణ కోసం పోరాడిన యువతపై కేసులు పెట్టి వేధించింది. పదేళ్ల బీఆరెస్ పాలనలో నిరుద్యుగులకు ఒరిగిందేం లేదు. తమ కుటుంబ సభ్యులకు పదవుల గురించి తప్ప.. వాళ్లు రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ఆలోచన చేయలేదు. కేసీఆర్ కుమార్తె కవితను ప్రజలు ఓడిస్తే, వెంటనే ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఉపాధి కల్పించారు. తెలంగాణ కోసం పోరాడిన వారి ఉద్యోగాల గురించి కేసీఆర్‌ ఏనాడూ ఆలోచించలేదు.

టీఎస్పీఎస్సీని ఇప్పటికే ప్రక్షాళన చేశాం. కొత్త ఛైర్మన్‌, సభ్యులను నియమించాం. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. మీ కళ్ళల్లో ఆనందం చూసి.. ఫామ్ హౌస్‌లో ఉన్నోళ్లు కుళ్లుకున్నా.. కడుపులో దుఃఖం పొంగుకొచ్చినా ఉద్యోగాల భర్తీ ఆగదు. బీఆర్ఎస్ నేతల ఉద్యోగాలు ఊడగొట్టగానే రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు వచ్చాయి. మేం ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంటే మా ప్రభుత్వంపై హరీష్ శాపనార్థాలు పెడుతుండు. హరీష్ రావు.. పిల్లి శాపనార్ధాలకు ఉట్టి తెగిపడదు. కేసీఆర్.. మీరైనా పిలిచి మీ అల్లుడికి గడ్డి పెట్టండి’’ అని రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
https://youtu.be/PVeQDXE6TAQ