GROUP 2: గ్రూప్ 2 పరీక్షపై రేవంత్ కీలక నిర్ణయం
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష ఎప్పుడు, ఎలా అనే అంశంపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై సమీక్ష జరిపిన ఆయన.. త్వరలోనే గ్రూప్ 2 పరీక్షను రీ షెడ్యూల్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
GROUP 2: నిరుద్యోగులకు కోపం వస్తే ఎలా ఉంటుందో.. తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ప్రూవ్ అయింది. ఐతే ఏటా జాబ్ క్యాలెండర్ ఉంటుందని.. రెండు లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అద్భుత విజయాన్ని అందుకుంది. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. టీఎస్పీఎస్పీ వ్యవహారంపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు రేవంత్. ఈ భేటీ తర్వాత టీఎస్పీఎస్పీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామా చేశారు. ఐతే దాన్ని గవర్నర్ ఆమోదించలేదు.
IAS IN TELANGANA: సచివాలయంలో అందమైన ఐఏఎస్.. తప్పనిసరిగా ఉండాల్సిందేనా..?
ఐతే తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష ఎప్పుడు, ఎలా అనే అంశంపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై సమీక్ష జరిపిన ఆయన.. త్వరలోనే గ్రూప్ 2 పరీక్షను రీ షెడ్యూల్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రూప్ 2 పరీక్ష రెండుసార్లు వాయిదా పడింది. చివరకు వచ్చే ఏడాది జనవరిలో జరగనుంది. దీని కింద మొత్తం 783 పోస్టులు ఖాళీగా ఉన్నాయ్. వీటి కోసం మొత్తం 5 లక్షల 51 వేల మందికి పైగా అప్లై చేసుకున్నారు. ఐతే.. రీ షెడ్యూల్ అయినా.. జనవరిలోనే ఈ పరీక్ష తప్పనిసరిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయ్. గ్రూప్ 2తోపాటూ TSPSCలో ఇతర పరీక్షలను కూడా రీషెడ్యూల్ చెయ్యాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు తెలిసింది.
పరీక్షల నిర్వహణ, రీషెడ్యూల్‌పై లోతుగా చర్చించారు రేవంత్. ఇప్పటివరకూ వచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలన్నీ రీషెడ్యూల్ చెయ్యాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా జాబ్ కేలండర్ ప్రకారం రిక్రూట్‌మెంట్ చేస్తారని తెలుస్తోంది. దీంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.