REVANTH REDDY: కంగ్రాట్స్ చెల్లి.. షర్మిలకు రేవంత్ రెడ్డి విషెస్..
తెలంగాణలో పార్టీని మూసేసి కాంగ్రెస్‌లో విలీనం చేయాలని నిర్ణయించినప్పటి నుంచి రేవంత్, షర్మిల మధ్య బాండింగ్ చాలా హెల్దీగా మారిపోయింది. ఎంత హెల్దీగా అంటే.. షర్మిల తన కొడుకు పెళ్లికి రేవంత్‌ను ఆహ్వానించేందుకు స్వయంగా తన ఇంటికి వెళ్లింది.
REVANTH REDDY: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య పచ్చగడ్డి వేస్తే మండిపోయేది. ఒకరి పేరు చెప్తే ఇంకొకరు విమర్శలతో విరుచుకుపడిపోయేవాళ్లు. రేవంత్ రెడ్డి గురించి షర్మిల ఏదైనా చెప్పాల్సి వస్తే ఫస్ట్ చెప్పే మాట దొంగ అని. ఆ మాట అన్న తరువాతే వేరే ఏదైనా మాట చెప్పేవారు షర్మిల. అయితే, ఇవన్నీ ఒకప్పటి మాటలు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తెలంగాణలో పార్టీని మూసేసి కాంగ్రెస్‌లో విలీనం చేయాలని నిర్ణయించినప్పటి నుంచి రేవంత్, షర్మిల మధ్య బాండింగ్ చాలా హెల్దీగా మారిపోయింది.
KTR: పెండింగ్ బిల్లులపై సర్పంచ్‌ల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా: కేటీఆర్
ఎంత హెల్దీగా అంటే.. షర్మిల తన కొడుకు పెళ్లికి రేవంత్‌ను ఆహ్వానించేందుకు స్వయంగా తన ఇంటికి వెళ్లింది. తన కొడుకు పెళ్లికి రావాలంటూ కార్డ్ ఇచ్చింది. మొదటిసారి షర్మిల తన ఇంటికి రావడంతో రేవంత్ కూడా ఆమెను చాలా గ్రాండ్‌గా రిసీవ్ చేసుకున్నాడు. శాలువాతో సత్కరించారు. దీంతో రాజకీయంగా శతృవులుగా ఉన్న వీళ్లను కాంగ్రెస్ పార్టీ ఒక్కటి చేసింది అని అంతా ఫిక్స్ అయ్యారు. అధికారికంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత పార్టీ హైకమాండ్ ఆమెకు ఏపీ పీసీసీ అధ్యక్షురాలి పదవి కట్టబెట్టింది. అధికారికంగా ప్రకటన కూడా చేసింది. దీంతో అంతా షర్మిలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా షర్మిలకు కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్ చేశారు. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి పదవి ఇవ్వడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. షర్మిల నాయకత్వంలో ఏపీలో పార్టీ బలపడాలంటూ ట్వీట్ చేశారు. దీంతో మరోసారి వీళ్ల మధ్య స్నేహం గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఉండరు అనడానికి వీళ్లిద్దరి కంటే పెద్ద ఎగ్జాంపుల్ లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Congratulations and all the very best to Smt. @realyssharmila garu on being appointed as the new President of @INC_Andhra pic.twitter.com/2GFiSbElCb
— Revanth Reddy (@revanth_anumula) January 16, 2024