Mallareddy : మాజీ మంత్రి మల్లారెడ్డికి రేవంత్ షాక్..
ఎప్పుడు జోష్‌లో ఉండే మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే (Medchal MLA) మల్లారెడ్డికి బిగ్‌షాక్ తగిలింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను వరుసగా బయటపెడుతోంది. అధికారం అడ్డం పెట్టుకొని.. ఎవరెవరు ఏమేం చేశారో.. అందరి లెక్కలు తేలుస్తున్నారు సీఎం రేవంత్. మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallar Reddy).. రేవంత్ సర్కార్ వరుసగా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది.
ఎప్పుడు జోష్‌లో ఉండే మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే (Medchal MLA) మల్లారెడ్డికి బిగ్‌షాక్ తగిలింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను వరుసగా బయటపెడుతోంది. అధికారం అడ్డం పెట్టుకొని.. ఎవరెవరు ఏమేం చేశారో.. అందరి లెక్కలు తేలుస్తున్నారు సీఎం రేవంత్. మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallar Reddy).. రేవంత్ సర్కార్ వరుసగా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. తమ భూముకు ఆక్రమించుకున్నారంటూ ఇప్పటికే మల్లారెడ్డి మీద కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇప్పుడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సొంత కాలేజీ కోసం.. తనది కాని స్థలంలో మల్లారెడ్డి వేసుకున్న రోడ్డును అధికారులు తొలగించారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండీఏ లేఅవుట్‌లో 25వందల గజాల స్థలం ఆక్రమించి.. సొంత కాలేజీ కోసం మల్లారెడ్డి రోడ్డు వేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయ్.
మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో.. రేవంత్ (CM Revanth Reddy) దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశారు కూడా ! ఐతే ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఐతే ఇప్పుడు ప్రభుత్వం మారడం.. రేవంత్ సీఎం కావడంతో.. మల్లారెడ్డికి షాక్ తప్పలేదు. దీనికితోడు హెచ్‌ఎండీఏ స్థలాల ఆక్రమణపై సర్కార్ చాలా సీరియస్‌గా ఉంది. దీంతో వీటిపై మేడ్చల్ కలెక్టర్ దృష్టి పెట్టారు. హెచ్ఎండీఏ లేఅవుట్‌లో అక్రమంగా ఏర్పాటు చేసిన రోడ్డును తొలగించాలని అధికారులను ఆదేశించారు. కాలేజీ కోసం వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. దీంతో మల్లారెడ్డికి భారీ షాక్ తగిలినట్లు అయింది. నిజానికి రేవంత్ సర్కార్ తమను టార్గెట్ చేసిందని.. మల్లారెడ్డి వర్గం ముందు నుంచి ఆరోపిస్తుండగా.. రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్.