CM. Revanth ఈ ఒక్క పనితో రేవంత్ అందరి మనసు దోచేశాడు.. ఇది కదా మాకు కావాల్సింది..
రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తులు వేరు వేరు పార్టీల్లో ఉంటే ఇక వాళ్ల మధ్య వైరం ఓ రేంజ్‌లో ఉంటుంది. పుట్టుకతోనే శతృవులం అన్నట్టు విమర్శలు ఆరోపణలు చేసుకుంటారు. ఈ వైరం రానురాను వ్యక్తిగతంగా మారుతుంది. ఇది వాళ్లకే కాదు.. సమాజానికి కూడా మంచిది కాదు. రాజకీయంగా ఎంత వైరం ఉన్నా వ్యక్తిగతంగా అంతా కలిసే ఉండాలి. కష్టం వచ్చినప్పుడు ఒకరికొరకు ధైర్యం చెప్పుకోవాలి.
రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తులు వేరు వేరు పార్టీల్లో ఉంటే ఇక వాళ్ల మధ్య వైరం ఓ రేంజ్‌లో ఉంటుంది. పుట్టుకతోనే శతృవులం అన్నట్టు విమర్శలు ఆరోపణలు చేసుకుంటారు. ఈ వైరం రానురాను వ్యక్తిగతంగా మారుతుంది. ఇది వాళ్లకే కాదు.. సమాజానికి కూడా మంచిది కాదు. రాజకీయంగా ఎంత వైరం ఉన్నా వ్యక్తిగతంగా అంతా కలిసే ఉండాలి. కష్టం వచ్చినప్పుడు ఒకరికొరకు ధైర్యం చెప్పుకోవాలి. అధికార ప్రతిపక్షాలు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఇప్పుడు అదే పని చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాలికి గాయంతో ఆపరేషన్ చేయించుకున్న మాజీ సీఎం కేసీఆర్‌ను స్వయంగా హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించారు. ఇప్పుడు మాత్రమే కాదు. కేసీఆర్ ప్రమాదానికి గురయ్యారు అని తెలిసిన తరువాత కూడా ఆనయ స్పందించిన తీరు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. అధికారులను వెంటనే హాస్పిటల్‌కు పంపి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు సీఎం. తరువాత స్వయంగా వెళ్లి కేసీఆర్‌తో మాట్లాడి కేసీఆర్‌కు ధైర్యం చెప్పారు. కేవలం రేవంత్ మాత్రమే కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రనేతలంతా కేసీఆర్‌ను కలిసేందుకు హాస్పిటల్‌కు వెళ్లారు. కేటీఆర్‌తో కూర్చొని మాట్లాడారు. పొద్దున లేస్తే ఒకరిపై ఒకరు విరుచుకుపడే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఇలా కష్ట సమయంలో ఒకరికొరు ధైర్యంగా ఉండటాన్ని రాష్ట్ర ప్రజలంతా మెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఫ్రెండ్లీ పాలిటిక్స్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందంటున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ వ్యవహరించిన తీరును ప్రశంసిస్తున్నారు. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం అంటూ మొన్నటి వరకూ మాట్లాడిన రేవంత్.. ఆయనకు కష్టం రాగానే స్వయంగా వెళ్లి పలకరించడం చాలా హుందాగా ఉంది అంటున్నారు. అటు నిర్మాత బండ్ల గణేష్ కూడా.. రేవంత్‌ను కేసీఆర్‌ను కలిసిన వీడియో ట్విటర్‌లో షేర్ చేశాడు. మీ మెచ్యూరిటి సలాం అన్నా అంటూ పోస్ట్ చేశారు.