హైడ్రా నోటీసులపై రేవంత్ తమ్ముడి రియాక్షన్…
తనకు హైడ్రా అధికారులు నోటీసులు పంపడంపై సిఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. శేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసు నా దృష్టికి వచ్చింది అన్నారు.

తనకు హైడ్రా అధికారులు నోటీసులు పంపడంపై సిఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. శేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసు నా దృష్టికి వచ్చింది అన్నారు. నేను 2015లో అమర్ సొసైటీలో ఒక నివాసాన్ని కొనుగోలు చేశానని అయితే… తాను కొనుగోలు చేసినప్పుడు ఈ భూమి ఎఫ్ టీఎల్ లో ఉందనే సమాచారం తన దగ్గర లేదని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎఫ్టీఎల్ లో ఉన్న భూములపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో నా బిల్డింగ్ ఉంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదని స్పష్టం చేసారు.