మోడీకి రేవంత్ లేఖ, కీలక నిర్ణయం తీసుకున్న సిఎం
వర్షాలు, వరద సాయంపై సమీక్ష లో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేసారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ గా ఉండాలని ఆయన హెచ్చరించారు. కలెక్టరేట్ లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు.

వర్షాలు, వరద సాయంపై సమీక్ష లో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేసారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ గా ఉండాలని ఆయన హెచ్చరించారు. కలెక్టరేట్ లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వ్యవస్థ ను సన్నద్దంగా ఉంచుకోవాలని అని ఆదేశించారు. భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలో ని 8 పోలీస్ బెటాలియన్ల కు ఎన్డీఆర్ఎఫ్ తరహా లో శిక్షణ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.
వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం 4 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్నామని అన్నారు. ప్రజలకు జరిగిన నష్టం పై తక్షణమే అధికారులు స్పందించాలని వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు,గొర్రెల కు పరిహారం పెంచాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వరద నష్టం పైన కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇక తక్షణమే కేంద్ర సాయం కోరుతు లేఖ రాసారు రేవంత్ రెడ్డి. జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతు లేఖ రాసారు. ఇక ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్త గూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్ల లకు తక్షణ సాయం కోసం 5 కోట్లు విడుదల చేసారు.