RGV – Jana Sena : సైకిలెక్కిన ఆర్జీవీ.. ట్విటర్‌లో షాకింగ్ పోస్ట్
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Verma) దయ్యాలను వదిలేసి చాలా కాలంగా రాజకీయ నాయకుల వెంట తిరుగుతున్నారు.

RGV on a bike.. Shocking post on Twitter
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Verma) దయ్యాలను వదిలేసి చాలా కాలంగా రాజకీయ నాయకుల వెంట తిరుగుతున్నారు. ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఎవరికి సపోర్ట్‌గా సినిమాలు చేస్తున్నాడో అందరికీ తెలుసు అందరం చూస్తూనే ఉన్నాం. చేసేదంతా చేసి చివరికి సింపుల్‌ఆ నా ఉద్దేశం అది కాదు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నానని కన్విన్స్ చేయడంలో ఆర్జీవీని (RGV) కొట్టేవాళ్లు లేరనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై చంద్రబాబుపై ఆర్జీవీ ఎలాంటి పోస్టులు వేస్తుంటాడో అందరికీ తెలుసు. వైసీపీ (YCP) కి సపోర్ట్ చేస్తూ టీడీపీ (TDP) జనసేన (Jana Sena) ను ఎగతాలి చేస్తూ గతంలో ఎన్నో పోస్టులు పెట్టాడు ఆర్జీవి. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి సైకిల్ ఎక్కాడు.
పవన్ సైకిల్ మీద ఉన్న ఫొటోను తన ఫొటోను కలిసి ట్విటర్‌లో షాకింగ్ పోస్ట్ పెట్టాడు. సైకిల్ ఎక్కాడు అంటే ఆర్జీవీ వెళ్లి టీడీపీలో చేరిపోయాడు అని కాదు. కామన్‌గానే జస్ట్ సైకిల్ ఎక్కాడు అంతే. తాను ఇంటర్ చదువుతున్న రోజుల్లో సైకిల్ మీద తీసుకున్న ఫొటోను.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైకిల్ మీద కూర్చన్న ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. పైన ఉన్న వ్యక్తి ఆర్జీవీ అని కింద ఉన్న వ్యక్తి మాత్రం ఎవరో తనకు తెలియదంటూ పోస్ట్ పెట్టాడు. కానీ రెండు ఫొటోల్లో ఉన్న కామన్ తింగ్ సైకిల్ అంటూ టీడీపీ ట్విటర్ అకౌంట్‌ను ట్యాగ్ చేశాడు.
దీంతో జనసేన టీడీపీ ఫ్యాన్స్ ఆర్జీవీని ఆడుకుంటున్నారు. నువ్ ఇక మారవా అని కొందరు అంటుంటే.. అదే సైకిల్‌తో వెళ్లి లారీ కింద పడు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక వైసీపీ కార్యకర్తలు మాత్రం మాస్ ర్యాగింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
The guy on the top is me , in my intermediate year and I don’t know who the guy in the bottom is ? The common thing is the CYCLE.. @JaiTDP pic.twitter.com/zGAQZSmgCD
— Ram Gopal Varma (@RGVzoomin) April 24, 2024