RGV Vyooham Movie : వ్యూహం రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండే రామ్‌గోపాల్‌ వర్మ ఏం చేసినా వెరైటీగానే ఉంటుంది. ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు తీసిన ఆర్జీవీ ఇప్పుడు మాత్రం రాజకీయాలు, కక్ష్యలకు సంబంధించి వివాదాస్పద సినిమాలు తీస్తున్నాడు. సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌ అవుదామనుకుంటున్నాడో లేక అందరినీ ఇరిటేట్‌ చేసి సంతోషం పొందాలి అనుకుంటున్నారో తెలియదు కానీ. కొంత కాలంగా ఆయన సెలెక్ట్‌ చేస్తున్న సినిమాలు అన్నీ దాదాపుగా అలాగే ఉంటున్నాయి. ఇందులో భాగంగానే వైఎస్‌ జగన్‌ లైఫ్‌ హిస్టరీ ఆధారంగా వ్యూహం సినిమా తీశాడు ఆర్జీవి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 11, 2023 | 12:06 PMLast Updated on: Oct 11, 2023 | 12:06 PM

Rgv Vyooham Movie Release Date Fix

కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండే రామ్‌గోపాల్‌ వర్మ ఏం చేసినా వెరైటీగానే ఉంటుంది. ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు తీసిన ఆర్జీవీ ఇప్పుడు మాత్రం రాజకీయాలు, కక్ష్యలకు సంబంధించి వివాదాస్పద సినిమాలు తీస్తున్నాడు. సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌ అవుదామనుకుంటున్నాడో లేక అందరినీ ఇరిటేట్‌ చేసి సంతోషం పొందాలి అనుకుంటున్నారో తెలియదు కానీ. కొంత కాలంగా ఆయన సెలెక్ట్‌ చేస్తున్న సినిమాలు అన్నీ దాదాపుగా అలాగే ఉంటున్నాయి. ఇందులో భాగంగానే వైఎస్‌ జగన్‌ లైఫ్‌ హిస్టరీ ఆధారంగా వ్యూహం సినిమా తీశాడు ఆర్జీవి.

రాజశేఖర్‌ రెడ్డి చనిపోయిన తరువాత జగన్‌ జీవితం ఎన్ని మలుపులు తిరిగింది అనే కథాంశంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను నవంబర్ 10న రిలీజ్‌ చేయబోతున్నట్టు అనౌన్స్‌ చేశాడు ఆర్జీవి. ఈ సినిమాతో పాటు దీని సీక్వెల్‌ సినిమా గురించి కూడా అప్‌డేట్‌ ఇచ్చాడు. వ్యూహంకు సీక్వెల్‌గా శపథం పేరుతో మరో సినిమా రాబోతున్నట్టు.. ఆ సినిమాను వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్‌ చేయబోతున్నట్టు చెప్పాడు. ఇప్పటికే వ్యూహం సినిమాకు సంబంధించి ట్రైలర్‌ రిలీజ్‌ చేశాడు. మధ్య మధ్యతో వర్కింగ్‌ షాట్స్‌ రిలీజ్‌ చేస్తూ ఆడియన్స్‌లో కుతూహలం పెంచాడు.

ఇక ఈ సినిమాలో చంద్రబాబును, పవన్‌ కళ్యాణ్‌ను మరింత సెటైరికల్‌గా ఆర్జీవి చూపించబోతున్నట్టు తెలుస్తోంది. రాజశేఖర్‌ రెడ్డి చనిపోయిన తరువాత జగన్‌ జీవితంలో ఏం జరిగింది అనేది మాత్రమే వ్యూహం సినిమాలో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. దాని తరువాత జగన్‌ సీఎం టర్మ్‌ శపథం సినిమాలో చూపించబోతున్నట్టు టాక్‌. ఇప్పటికే ఈ సినిమా చుట్టూ అనేక వివాదాలు చుట్టుకొని ఉన్నాయి. ఒక్కసారి సినిమా రిలీజైతే ఇక ఆ వివాదాలు తారా స్థాయికి చేరుతాయి. ఈ సినిమాలో అలాంటి వివాదాస్పద సీన్లు ఎన్ని ఉన్నాయో సినిమా రిలీజ్‌ అయ్యాక చూడాలి మరి.