Master Dating: మాస్టర్ డేటింగ్ అంటే ఏంటి..? ఇప్పుడీ ట్రెండ్ ఎందుకు నడుస్తుంది?
సెల్ఫ్ రెస్‌పెక్ట్ లాగానే సెల్ఫ్ లవ్ కూడా ముఖ్యమే.. మనల్ని మనం ప్రేమించుకోవడం అన్నిటికంటే ఇంపార్టెంట్. ప్రస్తుతం మాస్టర్ డేటింగ్ ట్రెండ్ రన్ అవుతుంది. ఒంటరిగా గడపడం కూడా ఓ వరమేనని చెప్పే డేటింగ్ ఇది.

Right now the master dating trend is running. This is dating that says that even being alone is a blessing.
డేటింగ్ అంటే అపొజిట్ జెండర్‌తోనే చేయాలా? లవర్‌తో కలిసే బయటకు వెళ్లాలా? తోడు లేకుండా హ్యాపీగా షికార్లు చేయలేమా? ఎందుకు చేయకూడదు..? ఒకసారి మీకు మీరే సోలోగా లాంగ్ డ్రైవ్‌కి వెళ్లండి.. టూరిస్ట్ స్పాట్స్‌ని చుట్టేయండి.. మీతో మీరే రెస్టారెంట్‌కి వెళ్లండి.. ఫుడ్‌ని ఎంజాయ్ చేయండి. ఇలా చేసి చూడండి. స్వీయ-అన్వేషణ అన్నది ఎంత గోప్పదో ఇప్పటికీ మనుషులు తెలుసుకోకపోవడం విడ్డూరం. ఇటివలి కాలంలో మాస్టర్ డేటింగ్(Master dating) అనే కాన్సెప్ట్ ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. ఇది స్వీయ-ప్రేమ, స్వీయ-సంరక్షణ, స్వీయ-సాధికారత వైపు కల్చరల్ మార్పును సూచిస్తుంది. సామాజిక నియమాల నుంచి బయటపడటానికి ప్రోత్సహిస్తుంది. ఒంటరిగా గడపడం కూడా మంచిదేనని.. కుంగిపోకుండా.. లోన్లీగా ఫీల్ అవ్వకుండా ఆలోచనా విధానం మార్చుకోవాలని చెబుతోంది.
డిజిటల్ యుగం ఈ డేటింగ్‌ని పాపులరైజ్ చేసింది. తమతో తామే కలసి జీవించడంలో ఉన్న అడ్వేంటేజీలను ఈ డేటింగ్ చూపిస్తుంది. ఇది మానసిక ఆరోగ్యంపైనా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. వేరే ఒకరి కోసం టైమ్ కేటాయించడం కంటే మన కోసం మనమే టైమ్ కేటాయించుకోవడం ఎందుకు ముఖ్యమో ఈ డేటింగ్ చెబుతుంది. ఎందుకంటే మనలోని లోపాలు కాకుండా ఇతరుల లోపలపైనే ఎక్కువగా దృష్టి పెట్టే మనుషులం మనం. ఇతురుల గురించి ఎక్కువగా ఆలోచించడం.. వారితోనే బయటకు వెళ్లాలని అనుకోవడం లాంటి వాటిపై ఎక్కువ ఫోకస్ చేస్తూ మనమేంటోనన్నది మనమే మర్చిపోతున్నాం.
వ్యక్తిగత ప్రాధాన్యతలను బట్టి మాస్టర్ డేటింగ్ ఎలాగైనా చేయవచ్చు. కొంతమంది సోలో హైకింగ్‌కు వెళ్లడానికి, ఆర్ట్ గ్యాలరీలను సందర్శించడానికి, మ్యూజిక్ కన్‌సర్ట్‌కు హాజరు కావడానికి ఇష్టపడతారు. మనకు ఇష్టమైన రెస్టారెంట్‌లో ఒకసారి మీకు ఇష్టమైన ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ తిని చూడండి. జర్నలింగ్, ధ్యానం లేదా ఒంటరిగా ఒక రోజు గడపడం లాంటి మరింత ఆత్మపరిశీలన విషయాలపైనే ఓసారి ఆలోచించండి. ఒంటరితనం వల్ల డిప్రెషన్ వస్తుందన్నది అధ్యయనలు చెప్పిన మాట నిజమే కావొచ్చు. కానీ ఆ అధ్యయనలను లోతుగా స్టడీ చేస్తే అసలు విషయాలు బయటపడతాయి. వేరొకరి లాగా ఉండలేకపోతున్నాం అన్న బాధ.. తోడు లేరని ఎక్కువగా ఆలోచించడం.. కష్టాలను ఒంటరిగా ఫేస్ చేయాలేమనే భావనలో బతకడం లాంటి ఆలోచనలు ఎక్కువగా ఉన్నవాళ్లని మానసిక సమస్యల వేధిస్తాయి. ఇలాంటి థింకింగ్ ఉన్నవాళ్లు చుట్టూ వందమంది ఉన్నా డిప్రెషన్‌లోకి వెళ్తారు. ఒంటరిగా ఉన్నా మనల్ని మనం ఎక్స్‌ప్లోర్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సమాజం ఏం అనుకుంటుందోన్న విషయాన్ని ముందు పక్కనపెట్టి మన పని మనం చేసుకుంటూ పోవాలి