Congress : చేరికలు… బుజ్జగింపులు.. ! కాంగ్రెస్ ఫటా ఫట్ ప్లాన్ ..!!
ప్రస్తుతం కాంగ్రెస్ లో మంచి ఊపు కనిపిస్తోంది. రాబోయేది కాంగ్రేస్ సర్కారే అని ఇతర పార్టీల్లో చాలామంది ప్రముఖులు చేతిని అందుకుంటున్నారు. మరోవైపు ఎప్పటి నుంచి పార్టీలో ఉన్న తమను కాదని ఇప్పుడొచ్చిన కొత్త వాళ్ళకి టిక్కెట్ ఇస్తారా .. అని బెదిరించి రాజీనామాలు చేస్తున్నారు మరికొందరు. అందుకే అటు వచ్చేవాళ్ళని కాదనకుండా.. ఇటు పార్టీ నుంచి బయటకు వెళ్లే వాళ్ళని బుజ్జగిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ ఫటా ఫట్ ప్లాన్ అప్లయ్ చేస్తోంది. ప్రతి రెండు, మూడు రోజులకోసారి కొత్త లీడర్ ని చేర్చుకోవడానికి స్కెచ్చేసిన.

Right now there is good momentum in Congress Many prominent people in other parties are joining hands that the next Congress government is coming
ప్రస్తుతం కాంగ్రెస్ ( Congress ) లో మంచి ఊపు కనిపిస్తోంది. రాబోయేది కాంగ్రేస్ సర్కారే అని ఇతర పార్టీల్లో చాలామంది ప్రముఖులు చేతిని అందుకుంటున్నారు. మరోవైపు ఎప్పటి నుంచి పార్టీలో ఉన్న తమను కాదని ఇప్పుడొచ్చిన కొత్త వాళ్ళకి టిక్కెట్ ఇస్తారా .. అని బెదిరించి రాజీనామాలు చేస్తున్నారు మరికొందరు. అందుకే అటు వచ్చేవాళ్ళని కాదనకుండా.. ఇటు పార్టీ నుంచి బయటకు వెళ్లే వాళ్ళని బుజ్జగిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ ఫటా ఫట్ ప్లాన్ అప్లయ్ చేస్తోంది. ప్రతి రెండు, మూడు రోజులకోసారి కొత్త లీడర్ ని చేర్చుకోవడానికి స్కెచ్చేసిన.
ఎన్నికల నామినేషన్ల కోలాహలం స్టార్ట్ అయింది. ఇప్పటికే BRS తో పోటీగా సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్స్ తో బిజీ బిజీగా ఉంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్, ప్రియాంక గాంధీ, శివకుమార్ లాంటి నేతల పర్యటనలు క్యాంపెయిన్ లో హీట్ పెంచుతోంది. దాంతో రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీయే అన్న మూడ్ ని జనంతో పాటు మిగతా పార్టీల లీడర్లలో కూడా తీసుకొస్తోంది.
ఈ టైమ్ లోనే బయట పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలను రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకూ… అందర్నీ చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ స్కెచ్చేసింది. ఇప్పటికే పార్టీని వీడి పోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ( Komatireddy Rajagopal Reddy ) , జి.వివేక్ లను మళ్ళీ తీసుకొచ్చింది. అలాగే బీజేపీలో అసంతృప్తిగా ఉన్న విజయశాంతి ( Vijayashanti ) , కొండా విశ్వేశ్వర్ రెడ్డి ( Konda Visveshwar Reddy ), ని కూడా లాక్కోవాలని ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్. ప్రతి 2,3 రోజులకోసారి.. ఏదో ఒక పెద్ద నాయకులను పార్టీలో చేర్చుకోవడానికి హస్తం పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర స్థాయి నాయకులే కాదు.. మండల స్థాయి లీడర్లను కూడా చేర్చుకుంటున్నారు. మండల స్థాయి, పంచాయతీ సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లను చేర్చుకోవడం వల్ల.. ఆయా గ్రామాలు, మండలాల పరిధిలోని జనం పైనా ఇంపాక్ట్ పడుతుందనేది కాంగ్రెస్ ప్లాన్. దాంతో రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ ఉందన్న భావన జనంలోకి పోతుందని ఆలోచిస్తున్నారు.
చేర్చుకోవడం ఒక్కటే కాదు.. పార్టీలో టిక్కెట్లు రాని వాళ్ళు.. కొత్త వాళ్ళ చేరికలతో ఉన్నవాళ్ళు ఇబ్బంది పడకుండా.. వాళ్ళని బుజ్జగించే పనిలో ఉన్నారు కాంగ్రెస్ సీనియర్లు. దానికోసం ఓ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకుంది హస్తం పార్టీ. AICC ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, CLP మాజీ నేత జనారెడ్డి.. AICC పరిశీలకులు కూడా నియోజకవర్గాల వారీగా అసంతృప్తులతో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు సహకరించాలని కోరుతున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే.. ఏదో ఒక పదవి ఇస్తామని వాళ్ళకి ఆశ చూపిస్తున్నారు కాంగ్రెస్ స్టేట్ లీడర్లు.
మొత్తానికి పోలింగ్ జరిగే తేదీ దాకా.. వచ్చేవాళ్ళు.. పోయేవాళ్ళతో బిజీ బిజీగా పార్టీని జనంలో ఉంచాలని కాంగ్రెస్ ప్లాన్ గా కనిపిస్తోంది.