Rihanna: అంబానీ పెళ్ళిలో స్టార్ల సందడి.. ఆ పాప్ క్వీన్‌కు రూ.70 కోట్లు రెమ్యూనరేషన్
ప్రీ వెడ్డింగ్ కోసం పాప్ స్టార్ రిహన్నా బృందం జామ్‌నగర్‌కు చేరుకుంది. ఈ వేడుకలో ఆమె తన టీమ్‌తో సహా ప్రత్యేకంగా ప్రదర్శన ఇవ్వనున్నారు. అయితే దీనికోసం అంబానీ ఫ్యామిలీ రిహన్నా అండ్ టీమ్‌కు ఇవ్వబోయే రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ న్యూస్‌గా మారింది.
Rihanna: బిలియనీర్లు, బిజినెస్ దిగ్గజాల ఇంట్లో పెళ్లి అంటే ఆ సందడి మామూలుగా ఉండదుగా. సినిమాల్లో చెప్పినట్లు, కవితల్లో వర్ణించినట్లు ఆకాశమంత పందిరి, భూదేవి అంత అరుగు వేసి అంగరంగ వైభవంగా చేస్తారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ మూడుముళ్ల వేడుక ఇప్పుడు అదే రేంజ్‌లో జరుగుతోంది. జామ్‌నగర్‌లోని రిలయన్స్ గ్రీన్స్‌లో అనంత్ అంబానీ-రాధిక వెడ్డింగ్ వేడుకలు షురూ అయ్యాయి.
SSMB 29: నీకెంత..? నాకెంత..? లెక్కలు వేసుకుంటున్నారు..
ముఖేష్ అంబానీ వారసుడి పెళ్లి సందడి అంబరాన్ని తాకుతోంది. దేశ, విదేశాల నుంచి ఈ పెళ్లికి టాప్ సెలబ్రిటీలు అటెండ్ అవుతున్నారు. ప్రీవెడ్డింగ్‌కి కేవలం ఒక రోజు మాత్రమే ఉండటంతో బాలీవుడ్ సెలబ్రిటీలు, గ్లోబల్ స్టార్స్ సహా పలువురు అతిథులు ఇప్పటికే గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు జామ్ జామ్ అంటూ వచ్చేస్తున్నారు. కాగా.. ఈ రిచెస్ట్ మ్యారేజీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రీ వెడ్డింగ్ కోసం పాప్ స్టార్ రిహన్నా బృందం జామ్‌నగర్‌కు చేరుకుంది. ఈ వేడుకలో ఆమె తన టీమ్‌తో సహా ప్రత్యేకంగా ప్రదర్శన ఇవ్వనున్నారు. అయితే దీనికోసం అంబానీ ఫ్యామిలీ రిహన్నా అండ్ టీమ్‌కు ఇవ్వబోయే రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ న్యూస్‌గా మారింది. ఈ ఈవెంట్ కోసం అంబానీ కుటుంబం రిహన్నాకు అక్షరాలా రూ.70 కోట్ల రెమ్యూనరేషన్ చెల్లించిందట. ఈ న్యూస్ విని నెటిజన్లు నోళ్లు వెళ్లబెడుతున్నారు. కుబేరుడు అంబానీ ఇంట్లో పెళ్లంటే మామూలుగా ఉంటుందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఈ సంవత్సరం అతిపెద్ద వివాహాలలో ఒకటిగా అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ వివాహం హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. అనంత్ అంబానీ వివాహాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. జులై 1వ తేదీన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం జరగనుంది. అయితే.. నేటి నుంచి మార్చి 3వ తేదీ వరకు ప్రి వెడ్డింగ్ వేడుకలు చేయనున్నారు. సన్నిహితులతో పాటు పలువురు ప్రముఖులకు ఈ ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కి ఆహ్వానం పంపింది అంబానీ ఫ్యామిలీ. మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలను ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేసింది.