రింకూ సింగ్ కు గోల్డెన్ ఛాన్స్, యూపీ టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు
భారత యువ క్రికెటర్ , సిక్సర్ల వీరుడు రింకూ సింగ్ కు అరుదైన అవకాశం దక్కింది. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో రింకూ ఉత్తరప్రదేశ్ జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు.

భారత యువ క్రికెటర్ , సిక్సర్ల వీరుడు రింకూ సింగ్ కు అరుదైన అవకాశం దక్కింది. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో రింకూ ఉత్తరప్రదేశ్ జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టడంతోనే రింకూకు ఈ అవకాశం దక్కింది. ఈ టోర్నీలో రింకూ తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 152కు పైగా స్ట్రైక్‌రేటుతో 277 పరుగులు చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లోనూ రింకూ సింగ్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు 57 మ్యాచ్‌లు ఆడిన రింకూ 1899 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 17 అర్ధ శతకాలు ఉన్నాయి. కాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ యూపీకి సారథ్యం వహించాడు. ఇప్పుడు రింకూ కెప్టెన్సీలోనే భువీ ప్లేయర్ గా ఆడబోతున్నాడు.