రిషబ్ పంత్ దూకుడు ధోనీ రికార్డు బ్రేక్
తొలి టెస్టులో భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ బెంగళూరుతో టెస్టులో చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. గాయంతో బాధపడుతూనే కీలక సమయంలో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.
తొలి టెస్టులో భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ బెంగళూరుతో టెస్టులో చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. గాయంతో బాధపడుతూనే కీలక సమయంలో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి 177 పరుగుల కీలక పార్టనర్ షిప్ నెలకొల్పాడు. 1 పరుగుతో సెంచరీ చేజార్చుకున్నప్పటకీ సర్ఫరాజ్ తో కలిసి భారత్ కు మంచి స్కోర్ అందించాడు. ఈ క్రమంలో పంత్ ఓ అరుదైన రికార్డు అందుకున్నాడు టెస్టుల్లో అత్యంత వేగంగా 2,500 పరుగుల మైలు రాయిని అందుకున్న భారత వికెట్ కీపర్‌గా రికార్డులకెక్కాడు. గతంలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పేరిట ఉండేది. ధోని ఈ మైలు రాయిని 69 ఇన్నింగ్స్‌లలో అందుకోగా.. రిషబ్ కేవలం 62 ఇన్నింగ్స్‌లలోనే సాధించాడు.