Rishabh Pant : రిషబ్ పంత్‌ ఇంట్లో పెళ్లి సందడి..

టీమిండియా ప్లేయర్‌ రిషబ్ పంత్‌ ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయ్. పంత్‌ సోదరి.. సాక్షి పంత్ నిశ్చితార్థం ఘ‌నంగా జ‌రిగింది. కుటుంబస‌భ్యులు, బంధుమిత్రుల స‌మ‌క్షంలో ఈ వేడుక జ‌రిగింది. త‌న‌కు కాబోయే బావ‌, సోద‌రి, త‌ల్లితో క‌లిసి దిగిన ఫోటోల‌ను.. పంత్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 7, 2024 | 06:29 PMLast Updated on: Jan 07, 2024 | 6:29 PM

Rishabh Pants House Is Full Of Wedding

టీమిండియా ప్లేయర్‌ రిషబ్ పంత్‌ ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయ్. పంత్‌ సోదరి.. సాక్షి పంత్ నిశ్చితార్థం ఘ‌నంగా జ‌రిగింది. కుటుంబస‌భ్యులు, బంధుమిత్రుల స‌మ‌క్షంలో ఈ వేడుక జ‌రిగింది. త‌న‌కు కాబోయే బావ‌, సోద‌రి, త‌ల్లితో క‌లిసి దిగిన ఫోటోల‌ను.. పంత్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు. ఇవి ఇప్పుడు వైరల్‌గా మారాయ్‌. కాబోయే వ‌ధూవ‌రుల‌కు నెటిజ‌న్లు శుభాకాంక్షలు చెప్తున్నారు. సాక్షీ, అంకిత్ చౌద‌రీ.. తొమ్మిదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమ‌కు పెద్దలు కూడా ప‌చ్చజెండా ఊప‌డంతో.. ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. త్వర‌లోనే ఈ ఇద్దరు పెళ్లి పీట‌లు ఎక్కనున్నారు.

త‌మ తొమ్మిదేళ్ల ల‌వ్‌స్టోరీలో మ‌రో కొత్త చాప్టర్ మొదలైంది అంటూ.. సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఇక రిషబ్ పంత్‌కు, ధోని కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. ధోని ఫ్యామిలీలో జరిగిన ప్రతీ వేడుకలో పంత్ కనిపిస్తుంటాడు. ఇప్పుడు పెళ్లిలోనూ తలైవా సందడి చేసే అవకాశం ఉంది. 2022 డిసెంబ‌ర్‌లో రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్‌ గాయపడ్డాడు. దీంతో ఏడాదికి పైగా ఆట‌కు దూరం అయ్యాడు. ఆపరేషన్ తర్వాత కోలుకున్నాడు. బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీలో ప్రస్తుతం ఫిట్‌నెస్ సాధించే ప‌నిలో ఉన్నాడు పంత్‌. టీ20 వాల్డ్ కప్‌లో చోటు సంపాదించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు.

ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో అత‌డు మ‌ళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టును న‌డిపించ‌నున్నాడు. ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన ఈ డాషింగ్ హిట్టర్.. ఐపీఎల్ 17 సీజ‌న్‌లో మ‌ళ్లీ ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్‌గా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐతే ఈ ఏడాది జూన్‌లో జ‌రిగే టీ20 వ‌ర‌ల్డ్‌కప్‌లో.. పంత్ ఆడ‌తాడా.. లేదా అనేది తెలియాలి మరి.