పరిమిత ఓవర్ల ఫార్మాట్ కు గుడ్ బై, రిషి ధావన్ సంచలన నిర్ణయం
భారత స్టార్ ఆల్ రౌండర్ రిషి ధావన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సోషల్ మీడియా ద్వారా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని తెలియజేశాడు.
భారత స్టార్ ఆల్ రౌండర్ రిషి ధావన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సోషల్ మీడియా ద్వారా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని తెలియజేశాడు. బీసీసీఐ, హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తో పాటు , పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీలకు థ్యాంక్స్ చెప్పాడు. అయితే అతడు రంజీ ట్రోఫీ సీజన్‌లో మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది. 2016లో భారత జట్టు తరుపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ ఆల్‌రౌండర్.. పెద్దగా రాణించింది లేదు. కానీ దేశవాళీ క్రికెట్‌లో రికార్డ్ ఉంది. రిషి ధావన్ 134 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 29.74 సగటుతో 186 వికెట్లు పడగొట్టాడు. ఒక సెంచరీ సహా 2906 పరుగులు చేశాడు.