Home » Latest » Rk Beach Which Has Become A War Ground Battle Maneuvers On The Sea Shore
Dialtelugu Desk
Posted on: December 11, 2023 | 01:03 PM ⚊ Last Updated on: Dec 11, 2023 | 1:03 PM
సాగర జలాలపై యుద్ధ విమానాల కవాతు..
గగనతలంలో హెలికాప్టర్ల పహారా..
హెలికాప్టర్ల నుంచి మెరుపు వేగంతో దిగిన కమాండోలు..
సాయంత్రం 4.20 గంటలకు ప్రారంభమైన విన్యాసాలు సుమారు రెండు గంటలపాటు నిర్విరామంగా సాగి నగరవాసులను అబ్బురపరిచాయి.
పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో ఓ యుద్ధనౌక
ఈవేడుకలకు ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్, జిల్లా ఇన్చార్జి మంత్రి విడదల రజిని, ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ హాజరయ్యారు.
యుద్ధ విన్యాసాలు వీక్షిస్తున్న కుటుంబ సభ్యులు
యుద్ద విన్యాసాలను తిలకిస్తున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్
ఈ వేడుకలకు ప్రస్తుత, మాజీ నేవీ అధికారులు హాజరు
నేవీ డే వేడుకలు త్రివర్ణ పతాకం రంగులను వెదజల్లేలా పేల్చిన బాంబులతో ప్రారంభమయ్యాయి.
యుద్ద సమయంలో ప్యారశుట్ తో ఆర్మీ
ఏటా డిసెంబరు నాలుగో తేదీన నిర్వహించే వేడుకలను ఈ ఏడాది మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో ఆదివారం నిర్వహించారు.
శత్రుమూకలపై నేవీ కమెండోల దాడులు..
వెరసి బీచ్ రోడ్డులో నేవీ విన్యాసాలు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి.
అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ల సహాయంతో లెఫ్టెనెంట్ కమాండర్ విక్రమ్ కంక్రివాల్, వికాస్ సారథ్యంలోని మెరైన్ కమాండోలు చేసిన ప్రత్యేక ఆపరేషన్ హైలెట్‌గా నిలిచింది.
ముంబై దాడుల తరువాత తీర భద్రతకు ప్రవేశపెట్టిన ఐఎస్‌వీ, ఎఫ్ఐసీఎస్ నౌకలపై చేపట్టిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
తీరం వెంబడి శత్రు స్థావరాలపై మూకుమ్మడి దాడులు ఆకట్టుకున్నాయి.
బాంబుల మోతతో దద్దరిల్లిన ఆర్కే బీచ్ తీరం..
నేవీ విన్యాసాలు చూసేందుకు వస్తున్న యువత
అబ్బురపరిచే విన్యాసాలు తమ ఫోన్లో అందిస్తున్న దృశ్యం
అంగరంగ వైభవంగా నేవీకా దినోత్సవం..
విన్యాసాలను తిలకిస్తున్న ప్రజలు
సముద్రం మధ్యలో సాహస విన్యాసాలు
పాంటమ్ లీడర్ కమాండర్ అశుతోష్ బోగ్డే నేతృత్వంలో ఐదు విమానాలతో చేపట్టిన విన్యాసాలు అబ్బురపరిచాయి.
అత్యాధునిక పరికరాలు, రాడార్, కమ్యూనికేషన్ సిస్టమ్స్‌తో శత్రుమూకలపై వేగంగా దాడులకు పాల్పడేందుకు ఉపకరిస్తాయి.
సముద్రంలో శత్రువలుపై దాడి జరిపే దృశ్యం
నాలుగు చేతక్ హెలికాప్టర్లతో లెప్టినెంట్ కమాండర్ అరుణ్రాగ్, ఇషాన్ కోర్, కెప్టెన్ అగ్నిహోత్రి, ఆయుష్ గోయెల్ నేతృత్వంలో చేపట్టిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
పెద్ద శబ్దంతో దూసుకుపోయిన యుద్ధ విమానాలు, కమాండర్ వెంకటరామన్ సారథ్యంలోని జలాంతర్గమామి సింధు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
నేవీ డే వేడుకలను వీక్షించేందుకు జనం భారీగా తరలివచ్చారు.
అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ సాయంతో పేలిన ఆయిల్ రిగ్ అలలపై అగ్నికీలలను ఎగజిమ్మింది.
యుద్ధ నౌకల విన్యాసాలు
యుద్ధ నౌకల విన్యాసాలు.
యుద్ధ హెలికాప్టర్లు
సాగర తీరంలో సూర్యస్తమయ సమయంలో.. నేవీ విన్యాసాలు
శరవేగంతో దూసుకుపోయిన యుద్ధ విమానాలు..
ఉడా పార్క్ నుంచి ఫిషింగ్ హార్బర్ వరకు వేలాదిగా చేరిన జనం విన్యాసాలు తిలకించారు. సెల్ఫోన్లతో వీడియాలను చిత్రీకరిస్తూ కనిపించారు.
నేవీ ఉద్యోగుల వేడుకలు
నేవీ ఉద్యోగ జీవితంలోని కీలకమైన అంశాలతో విద్యార్థులు నృత్య ప్రదర్శన ఇచ్చారు.