నా సత్తా ఏంటో రోహిత్ కు తెలుసు, హార్థిక్ పాండ్యా కామెంట్స్

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. టి20 సిరీస్ లో అద్భుతంగా రాణించిన పాండ్యా వన్డేల్లోనూ అదరగొడతాడని అంచనా వేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 7, 2025 | 04:06 PMLast Updated on: Feb 07, 2025 | 4:06 PM

Rohit Knows My Potential Says Hardik Pandya

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. టి20 సిరీస్ లో అద్భుతంగా రాణించిన పాండ్యా వన్డేల్లోనూ అదరగొడతాడని అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ ప్రారంభానికి ముందు హార్దిక్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మపై అతను చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తటీ ట్వంటీ ప్రపంచకప్ ఫైనల్ కు సంబంధించి ఈ విషయాలను పంచుకున్నాడు. న సత్తా ఏంటనేది రోహిత్ కు బాగా తెలుసనీ వ్యాఖ్యానించాడు. క్లాసెన్‌ను అవుట్ చేయడానికి ముందు రోహిత్ తో చర్చించినట్లు చెప్పాడు. బంతి వేయడానికి ముందు క్లాసెన్‌కు వైడ్ బాల్ వేస్తానని రోహిత్ తో చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇలా పక్కా ప్లాన్ తోనే క్లాసెన్‌ వికెట్ తీశానని చెప్పాడు. రోహిత్ తో విభేదాలున్నట్టు వార్తలను పాండ్యా కొట్టిపారేశాడు. అవన్నీ అవాస్తవాలేనని, కెప్టెన్ తో తనకు మంచి రిలేషన్ ఉందంటూ చెప్పుకొచ్చాడు.

గతంలో రోహిత్, హార్దిక్ మధ్య విభేదాలున్నట్లు వార్తలు వినిపించాయి. గత సీజన్ ఐపీఎల్ కి ముంది రోహిత్ ను కెప్టెన్ నుంచి తప్పించి ముంబైకి హార్దిక్ ను కెప్టెన్ గా ఎంపిక చేశారు. మ్యాచ్ సందర్భంహా రోహిత్ ని హార్థిక్ బౌండరీ లైన్ దగ్గరకు ఫీల్డింగ్ కి పంపడం అప్పట్లో సంచలనంగా మారింది. కానీ టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ హార్దిక్ ని కౌగిట్లోకి తీసుకుని ఏడుస్తున్న హార్దిక్ ని ఓదార్చడం అందర్నీ ఎమోషనల్ గా కనెక్ట్ చేసింది. ఇద్దరూ భావోద్వేగానికి గురై ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రిపరేషన్స్ పైనా హార్థిక్ మాట్లాడాడు. ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అంచనాలను షేర్ చేసుకున్నాడు. పెద్ద టోర్నీల్లో ఆడేటప్పుడు ఒత్తిడిని ఎవరు బాగా ఎదుర్కొంటారనేది ముఖ్యమన్నాడు. తాను హార్దిక్ పాండ్యా తరఫున ఆడననీ, జట్టు తరఫున , దేశం ఇండియా తరఫున ఆడడమే లక్ష్యమని చెప్పాడు. చివర్లో రెండు బంతులు ఆడినా.. 60 బంతులు బ్యాటింగ్ చేసినా టీమిండియాను గెలిపించడం పైనే తన ఫోకస్ ఉంటుందన్నాడు.

ఇక పాకిస్థాన్ తో మ్యాచ్ లో ఒత్తిడిని ఎవరూ బాగా హ్యాండిల్ చేస్తారనేది కీలకమన్నాడు. ఇదే సమయంలో 2022 టీ20 ప్రపంచ కప్‌లో మెల్‌బోర్న్‌లో పాకిస్థాన్ పై జరిగిన ఉత్కంఠ మ్యాచ్ గుర్తుచేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో అభిమానులు ఇచ్చిన సపోర్ట్ మరవలేనని.. ఎంతో భావోద్వేగంతో కూడుకుందని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఆల్ రౌండర్ గా ఈ మ్యాచ్ లో పాండ్య అద్భుతంగా రాణించాడు. బౌలింగ్ లో మూడు వికెట్లు తీయడంతో పాటు.. బ్యాటింగ్ లో హాఫ్ సెంచరీతో రాణించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ జట్టుకు కీలక ఆటగాడిగా రాణించాలన్నదే తన లక్ష్యమని పాండ్యా చెప్పుకొచ్చాడు.