పెర్త్ లోనే రిటైర్మెంట్, తానే ఆపానన్న రోహిత్

అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రవిచంద్రన్ అశ్విన్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మరికొన్నాళ్ళు ఆడాల్సిందంటూ భారత అభిమానులు అశ్విన్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 18, 2024 | 02:14 PMLast Updated on: Dec 18, 2024 | 2:14 PM

Rohit Says He Will Retire In Perth Says He Will Do It Himself

అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రవిచంద్రన్ అశ్విన్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మరికొన్నాళ్ళు ఆడాల్సిందంటూ భారత అభిమానులు అశ్విన్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అశ్విన్ చాలా ఫిట్ గా ఉన్నాడని, మరో రెండేళ్ళు ఈజీగా ఆడేవాడంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అశ్విన్ పెర్త్ టెస్ట్ సమయంలోనే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడని రోహిత్ వెల్లడించారు. తానే పింక్ బాల్ టెస్టులో ఆడమని కోరితే, నిర్ణయాన్ని ఈ మ్యాచ్ కు వాయిదా వేసుకున్నాడని అసలు సంగతి చెప్పాడు. భారత క్రికెట్ జట్టు ఖచ్చితంగా అశ్విన్ ను మిస్ అవుతుందంటూ రోహిత్ వ్యాఖ్యానించాడు. ఇప్పటి వరకూ అతని కెరీర్ గణాంకాలు చూస్తే అశ్విన్ సత్తా ఏంటో అర్థమవుతుందని, అతనో మ్యాచ్ విన్నర్ అంటూ ప్రశంసించాడు.