జైశ్వాల్ కు రోహిత్ చివాట్లు, క్రమశిక్షణతో ఉండాలని వార్నింగ్
ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న టీమిండియా ప్రస్తుతం మూడో టెస్ట్ కోసం రెడీ అవుతోంది. గబ్బా వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ కోసం నెట్స్ లో చెమటోడ్చుతోంది. ఫామ్ లో లేని రోహిత్ , కోహ్లీతో పాటు పంత్ ప్రాక్టీస్ లో ఎక్కువగానే సమయం గడుపుతున్నారు.
ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న టీమిండియా ప్రస్తుతం మూడో టెస్ట్ కోసం రెడీ అవుతోంది. గబ్బా వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ కోసం నెట్స్ లో చెమటోడ్చుతోంది. ఫామ్ లో లేని రోహిత్ , కోహ్లీతో పాటు పంత్ ప్రాక్టీస్ లో ఎక్కువగానే సమయం గడుపుతున్నారు. ఎలాగైనా గబ్బా టెస్టులో గెలిచి సిరీస్ లో ఆధిక్యాన్ని పెంచుకోవాలని భారత్ ఎదురుచూస్తోంది. అయితే యువ ఓపెనర్ జైశ్వాల్ కు కెప్టెన్ రోహిత్ శర్మ చివాట్లు పెట్టాడు. ఆటపరంగా కాదు… క్రమశిక్షణ పరంగా జైశ్వాల్ సరిగా వ్యవహరించకపోవడంతో గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అడిలైడ్ నుంచి బ్రిస్బేన్ వెళ్లేందుకు జట్టులోని ఆటగాళ్లంతా సిద్దమవ్వగా.. యశస్వి జైస్వాల్ అలసత్వంగా వ్యవహరించడం ఇబ్బందిగా మారింది.
టీమ్ ఫ్లైట్ టైమ్ ఉదయం 10.30 గంటలకు ఉండగా.. టీమ్ హోటల్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయల్దేరాలని నిర్ణయించారు. దాంతో ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గౌతమ్ గంభీర్.. అందరూ నిర్ణీత సమయంలోపు బస్సెక్కారు. టీమిండియా సెక్యూరిటీ ఆఫిసర్ ఒక ఆటగాడు తక్కువగా ఉన్నాడని గుర్తించాడు. దాంతో బస్సు కదిలేందుకు అతను అంగీకరించలేదు. 20 నిమిషాలకు పైగా బస్సులోనే జట్టంతా వెయిట్ చేసింది. తీవ్ర ఆగ్రహానికి గురైన రోహిత్ శర్మ బస్సును స్టార్ట్ చేయాలని ఆదేశించాడు. మరోవైపు బస్సెక్కని ఆటగాడు యశస్వి జైస్వాల్ అని గుర్తించారు. తర్వాత జైశ్వాల్ మరో కారులో ఎయిర్ పోర్టుకు చేరుకోగానే రోహిత్ మందలించాడు. క్రమశిక్షణతో నడుచుకోవాలని చివాట్లు పెట్టాడు. యశస్వి జైస్వాల్ ఆలస్యంగా వచ్చినా.. ఫ్లైట్ సమయానికి జట్టుతో కలవడంతో అందరూ బ్రిస్బేన్ చేరుకున్నారు.