ROHIT SHARMA: రిటైర్మెంటా.. ఎవరు చెప్పారు..? 2027 వరల్డ్ కప్ కూడా ఆడతా..!

ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలో రిటైర్మెంట్ మీద ఈ మధ్య పుకార్లు ఎక్కువయ్యాయి. మరీ ముఖ్యంగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత ఇది ఇంకా శృతి మించింది. త్వరలోనే రోహిత్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 12, 2024 | 07:30 PMLast Updated on: Apr 12, 2024 | 7:30 PM

Rohit Sharma Makes Retirement Stance Clear With Big World Cup Wtc Final Remark

ROHIT SHARMA: క్రికెట్‌లో 35 ఏళ్లు దాటాక బ్యాటర్ మునుపటిలా బాల్ మీద ఫోకస్ చేయడం, వికెట్ల మధ్య పరుగులు తీయడం, సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడటం కష్టమే. దీంతో చాలా మంది ఆ వయసులోపే రిటైర్మెంట్ ఇచ్చేస్తుంటారు. భారత ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలో రిటైర్మెంట్ మీద ఈ మధ్య పుకార్లు ఎక్కువయ్యాయి. మరీ ముఖ్యంగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత ఇది ఇంకా శృతి మించింది.

Poonam Kaur: మూడు పెళ్లిళ్లపై పూనమ్ కౌర్ కౌంటర్.. ఈసారి వైసీపీకేనా..?

త్వరలోనే రోహిత్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ స్పందించాడు. ఇప్పట్లో రిటైర్ అయ్యే ప్రసక్తే లేదని రోహిత్ తేల్చిచెప్పాడు. తాను ఇప్పుడు మంచి టచ్‌లో ఉన్నానని, ఆ రెండు కప్పులు గెలవడమే టార్గెట్‌గా పెట్టుకున్నానని చెప్పాడు. వన్డే వరల్డ్ కప్ అసలైన వరల్డ్ కప్ అని.. చిన్నప్పటి నుంచి ఆ టోర్నీని చూస్తూ తాను పెరిగానన్నాడు. గతేడాది తృటిలో ప్రపంచ కప్ మిస్సయిందని వాపోయాడు. 2027లో సౌతాఫ్రికాలో జరగబోయే వరల్డ్ కప్ కూడా ఆడతాను అన్నట్లుగా రోహిత్ మాట్లాడాడు. అలాగే 2025లో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కూడా నెగ్గాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. దీంతో రోహిత్ ఇప్పట్లో ఆటకు గుడ్ బై చెప్పే అవకాశం లేదని తేలిపోయింది.

గతేడాది రోహిత్ కెప్టెన్సీలోనే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌తోపాటు వరల్డ్ కప్ ఫైనల్లోనూ ఓడిపోయింది. అయితే ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాను రోహిత్ శర్మనే లీడ్ చేయనున్నాడు. గతేడాది మిస్సయిన వన్డే వరల్డ్ కప్ కలను ఈసారి టీ20 వరల్డ్ కప్ రూపంలో రోహిత్ తీర్చుకుంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది.