World Cup: రెండు విషయాలు క్లియర్ వరల్డ్ కప్ మనదే

బంగ్లాదేశ్ తో ఓటమిపాలైన తరువాత టీం ఇండియా రథసారధి రోహిత్ శర్మ స్పందించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 16, 2023 | 01:13 PMLast Updated on: Sep 16, 2023 | 1:13 PM

Rohit Sharma Reacts After Losing To Bangladesh In The Asia Cup Series

ఆసియాకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రోహిత్ శర్మ.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని, బంగ్లాదేశ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతోనే ఓటమిపాలయ్యామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. శుభ్‌మన్ గిల్ మాత్రం అసాధారణంగా బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు. ‘వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో మా బెంచ్ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనుకున్నాం.

అయితే ఈ మ్యాచ్‌లో మేం ఆడిన విధానానికి ఏ మాత్రం రాజీపడటం లేదు. ప్రపంచకప్ ఆడబోయే ఆటగాళ్లకు గేమ్ టైమ్ ఇవ్వాలనుకున్నాం. అక్షర్ పటేల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అని టీమిండియా కెప్టెన్ ప్రశంసించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. ఛేదనలో భారత్, 49.5 ఓవర్లలో 249 పరుగులకు కుప్పకూలింది. సమిష్టిగా రాణించిన బంగ్లా బౌలర్లు, భారత్ ను ఏ దశలోనూ కోలునొవ్వికుండా వికెట్లు పడగొడుతూ, ఆసియా కప్ నిష్క్రమణలో కాస్త ఊరటనిచ్చే విజయాన్ని పొందారు.