Asia cup: షాక్..! టీమిండియాకు నంబర్‌-4లో బ్యాటింగ్‌ చేసేదెవరో తెలిసిపోయిందోచ్!

యువరాజ్‌ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం ఐనప్పటి నుంచి ఇప్పటివరకు టీమిండియాకు నంబర్‌-4లో ఆడే సరైన ఆటగాడు దొరకలేదు.. ఇప్పుడు ఆ స్థానాన్ని ఫిల్ చేసేందుకు ప్లాన్‌ రెడీ ఐనట్టు సమాచారం!

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 29, 2023 | 01:47 PMLast Updated on: Aug 29, 2023 | 1:47 PM

Rohit Sharma To Open With Shreyas Iyer In Asia Cup Game And Kohli At Number 4 Says Sources

ఆసియా కప్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో ఊహించని మార్పులు జరగనున్నాయా? దశాబ్ద కాలంగా టీమిండియాను ముప్పుతిప్పలు పెడుతున్న నంబర్‌-4 బ్యాటింగ్‌ పొజిషన్‌పై మ్యానేజ్‌మెంట్ ఓ నిర్ణయానికి వచ్చేసిందా? అంటే అవుననే సమాధానమే వినినిస్తోంది. దాదాపు పదేళ్లుగా ఆ స్థానంలో డజనుపైగా ప్లేయర్లను పరీక్షించింది బీసీసీఐ. ఇక ఈ పరీక్షలకు ముగింపు పలకాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. యువరాజ్‌ స్థాయిని రిప్లేస్‌ చేసే బ్యాటర్ల కోసం వెతికి వెతికి విసిగిపోయిన బీసీసీఐ.. ఇక కింగ్‌కే ఆ బాధ్యతలు అప్పగించాలని డిసిషన్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది.

విరాట్‌ కోహ్లీ.. నంబర్‌-3 పొజిషన్‌కి అన్నివిధాల సెట్ అయిన ఆటగాడు. వన్‌ ఆఫ్‌ ది క్రికెట్‌ గ్రేట్‌, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాయింటింగ్‌ని మించి ఆ స్థానంలో రికార్డులు సునామీ సృష్టించిన ఆటగాడు కోహ్లీ.. ఇప్పుడు కోహ్లీనే నంబర్‌-4లో ఆడించాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కోహ్లీ తప్ప ఆ స్థానానికి ప్రస్తుత జట్టులో ఎవరూ న్యాయం చేయాలేరని టీమ్‌ మ్యానేజ్‌మెంట్‌ భావిస్తున్నట్టు సమాచారం. క్రికెట్‌లో ఏ ఫార్మెట్‌లోనైనా నంబర్‌-4 అన్నది చాలా కీ పొజిషన్‌. సందర్భానికి తగ్గట్టుగా ఆడే పొజిషన్‌ అది. సచిన్‌, యువరాజ్‌ ఆ స్థానంలో టన్నుల కొద్దీ పరుగులు చేశారు. ఇప్పుడు ఆ బాధ్యతను విరాట్‌కి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సెప్టెంబర్‌-2న ఆసియాకప్‌లో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్‌ పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌ నుంచే ప్రయోగం చేయాలని జట్టు అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఓపెనర్లగా రోహిత్‌-శ్రేయస్‌ అయ్యర్‌ బరిలోకి దిగుతారని.. వన్‌ డౌన్‌లో గిల్‌ బ్యాటింగ్‌కి వస్తాడన్న టాక్‌ వినిపిస్తోంది. లేకపోతే రోహిత్‌-గిల్ ఓపెనింగ్‌కి వస్తారని.. అయ్యర్‌ని నంబర్‌-3లో ఆడిస్తారని.. ఏది ఏమైనా కోహ్లీని మాత్రం నంబర్‌-4లోనే ఆడించాలని బీసీసీఐ డిసైడ్‌ ఐనట్టు సమాచారం. నిజానికి 2011 ప్రపంచ కప్‌లో కోహ్లీ నంబర్‌-4లోనే బ్యాటింగ్‌ చేశాడు.. అప్పుడు సచిన్‌, సెహ్వాగ్‌, గంభీర్‌ తొలి మూడు స్థానాల్లో బ్యాటింగ్‌కి వచ్చేవాళ్లు. అటు మాజీలు మరో సూచన కూడా చేస్తున్నారు. రోహిత్‌ శర్మనే నంబర్‌-4లో ఆడించాలని..రాహుల్‌-గిల్‌ను ఓపెనింగ్‌ దింపాలని చెబుతున్నారు. రోహిత్ శర్మ ఓపెనర్‌గా అవతారం ఎత్తకముందు మిడిల్‌ ఆర్డర్‌లోనే బ్యాటింగ్‌ చేసేవాడన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.