ఒరేయ్ ఇది గల్లీ క్రికెట్ కాదు, జైశ్వాల్ పై రోహిత్ ఫైర్
ఏ గేమ్ లోనైనా కెప్టెన్సీ చేయడం అంటే అంత ఈజీ కాదు.. క్రికెట్ అయితే ఎప్పటికప్పుడు ఫీల్డింగ్ మార్పులు చేస్తూ, బౌలర్లను మారుస్తూ ప్రత్యర్థి జోరుకు బ్రేక్ వేయాల్సి ఉంటుంది.. ఈ విషయంలో ఒక్కో కెప్టెన్ ది ఒక్కో స్టైల్...
ఏ గేమ్ లోనైనా కెప్టెన్సీ చేయడం అంటే అంత ఈజీ కాదు.. క్రికెట్ అయితే ఎప్పటికప్పుడు ఫీల్డింగ్ మార్పులు చేస్తూ, బౌలర్లను మారుస్తూ ప్రత్యర్థి జోరుకు బ్రేక్ వేయాల్సి ఉంటుంది.. ఈ విషయంలో ఒక్కో కెప్టెన్ ది ఒక్కో స్టైల్… ధోనీ లాంటి వాడైతే కూల్ గా జట్టును లీడ్ చేస్తే …కోహ్లీ, రోహిత్ లాంటి కెప్టెన్ లు గ్రౌండ్ లో కాస్త అగ్రెసివ్ గానే ఉంటుంటారు… ఈ క్రమంలో సహచర ఆటగాళ్ళపై ఒక్కోసారి కోప్పడుతూ ఉంటారు..మైదానంలో రోహిత్ శర్మ చాలా అలర్ట్‌గా ఉంటాడు. ఫీల్డర్లు ఏదైన తప్పు చేస్తే తనదైన శైలిలో సరదాగానే మందలిస్తూ ఉంటాడు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన కోపాన్ని బయటపెట్టాడు. యశస్వి జైస్వాల్ ఫీల్డింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన రోహిత్, ఇదేమైనా గల్లీ క్రికెట్ అనుకుంటున్నావా అంటూ చుకరకలంటించాడు. అతని మాటలు స్టంప్ మైక్‌లో క్లియర్ గా వినపడ్డాయి. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జడేజా బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే స్మిత్ బంతిని కొట్టగా, బంతి అతని వద్దకు రాకముందే జైస్వాల్ గాల్లోకి ఎగిరాడు. పక్కనే ఉండి అంతా గమనిస్తున్న కెప్టెన్ రోహిత్ జైస్వాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. గల్లీ క్రికెట్ ఆడుతున్నావా అంటూ ఫైర్ అయ్యాడు. ఆ తరువాత మరోసారి కూడా జైస్వాల్‌ను మందలించాడు రోహిత్. ఫీల్డింగ్ చేసేటప్పుడు ఫీల్డర్లు మోకాళ్ల నిలబడి ఉండడాన్ని చూస్తునే ఉంటాం. అయితే.. యశస్వి నిటారుగా నిలబడి ఉండగా.. ఫీల్డింగ్ సరిగ్గా చేయ్.. బంతిని ఆడే వరకు మోకాళ్ల పైనే ఉండు అంటూ అని అరిచాడు. రోహిత్ శర్మ మాటలు స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి.
ఇదిలా ఉంటే బాక్సింగ్ డే టెస్ట్ తొలిరోజు ఆసీస్ దే పైచేయిగా నిలిచింది. కంగారూ జట్టులో నలుగురు టాపార్డర్ ఆటగాళ్ళు హాఫ్ సెంచరీ చేయగా… భారత బౌలర్లు చివరి సెషన్ లో పుంజుకున్నప్పటకీ అప్పటికే ఆసీస్ మంచి స్కోర్ చేసింది. తొలిరోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా 6 వికెట్లకు 311 రన్స్ చేసింది.