బెంగళూరు టెస్ట్ అంపైర్లతో రోహిత్ వాగ్వాదం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ విరాట్ కోహ్లి అంపైర్ల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆటను ఎలా నిలిపివేస్తారంటూ ఫీల్డ్ అంపైర్లతో వాదనకు దిగారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ విరాట్ కోహ్లి అంపైర్ల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆటను ఎలా నిలిపివేస్తారంటూ ఫీల్డ్ అంపైర్లతో వాదనకు దిగారు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు నాలుగోరోజు వెలుతురులేమి కారణంగా దాదాపు అరగంట ముందుగానే ఆటను నిలిపివేయాలని అంపైర్లు నిర్ణయించారు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ వారి దగ్గరకు వెళ్లి వాదనకు దిగగా.. కోహ్లి కూడా అతడికి జత కలిశాడు. ఆట నిలిపే ప్రసక్తే లేదంటూ వీరిద్దరూ అంపైర్లకు గట్టిగా చెబుతుండడం కనిపించింది. అంపైర్లు మాత్రం మ్యాచ్ ను నిలిపివేసేందుకే నిర్ణయించిన కాసేపటికే వర్షం కూడా కురవడంతో రోహిత్ , కోహ్లీ డగౌట్ కు వెళ్ళిపోయారు. తర్వాత మ్యాచ్ రిఫరీ కూడా భారత డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చి రోహిత్ కు సర్దిచెబుతున్న వీడియో వైరల్ గా మారింది.