Praneet arrest : రోతగాడికి మూడింది.. ప్రణీత్ అరెస్ట్.. ఊచలు లెక్కించేలా చేసింది వీళ్లే..
మైక్ ఉందని వాగేసి.. సోషల్ మీడియా ఉంది కదా అని రాసేసి.. ఇష్టం వచ్చినట్లు చేస్తే.. తాట తీస్తారు జాగ్రత్త. ప్రణీత్ ఎపిసోడ్‌తో ఇప్పుడు వినిపిస్తున్న మాటలు ఇవే.
మైక్ ఉందని వాగేసి.. సోషల్ మీడియా ఉంది కదా అని రాసేసి.. ఇష్టం వచ్చినట్లు చేస్తే.. తాట తీస్తారు జాగ్రత్త. ప్రణీత్ ఎపిసోడ్‌తో ఇప్పుడు వినిపిస్తున్న మాటలు ఇవే. తండ్రీకూతుళ్ల బంధానికి బూతులు అద్ది.. రాక్షసానందం పొంది.. నలుగురితో నవ్వుతూ నానా దరిద్రం చేసిన ప్రణీత్‌గాడి పేరు చెప్తే.. చాలామందికి రక్తం ఉడికిపోతోంది. ఐతే ఎట్టకేలకు ప్రణీత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో అతన్ని అరెస్ట్ చేశారు. లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రణీత్‌ను హైదరాబాద్ తీసుకురానున్నారు. ప్రణీత్‌తో పాటు మరో ముగ్గురిపై కూడా కేసులు నమోదయ్యాయ్. వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తారని తెలుస్తోంది.
ప్రణీత్ చేసిన దరిద్రపు కామెంట్లను సినిమా, పొలిటికల్ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. ముందుగా ఈ ఇష్యూని టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ అడ్రస్ చేశాడు. ఇలాంటి వాళ్లను వదలకూడదు అంటూ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత అసలు ఈ ఇష్యూ ఏంటి అనేది త్వరగా జనాల్లోకి వెళ్లింది. అందరూ ఈ సంఘటన గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. సోషల్ మీడియాలో కూడా పోస్టులు వచ్చాయి. సాయి ధరమ్ తేజ్ తర్వాత అంతే ఎఫెక్టివ్‌గా… బలంగా స్పందించిన హీరో మంచు మనోజ్. ప్రణీత్ హనుమంతుకు మనోజ్ నేరుగా వార్నింగ్ ఇచ్చాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేసి రిక్వెస్ట్ చేశాడు. మనోజ్ అభ్యర్థనకు సీఎం రేవంత్ స్పందించారు కూడా. కచ్చితంగా ఈ అంశంపై చర్యలు తీసుకుంటాం అంటూ హామీ కూడా ఇచ్చారు.
ఇప్పుడు అది అరెస్టు వరకు వచ్చింది. అలాగే ఈ అంశంపై మరో యంగ్ హీరో కార్తికేయ కూడా రెస్పాండ్ అయ్యాడు. నిజానికి ప్రణీత్ హనుమంతుతో కార్తికేయ తన సినిమా ప్రమోషన్స్ చేయించాడు. కానీ, ఈ సంఘటన తర్వాత తాను ప్రణీత్ హనుమంతును సంప్రదించి చాలా పెద్ద తప్పు చేశాను అంటూ కార్తికేయ రియాక్ట్ అయ్యాడు. కచ్చితంగా కఠిన చర్యలు ఉండాల్సిందే అని అన్నాడు.