MLC Kavita : కవితకు దెబ్బ మీద దెబ్బ.. మరోసారి కస్టడీ పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR).. కుమార్తె బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత (Kavita) కు మళ్లి నిరాశే మిగిలింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR).. కుమార్తె బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత (Kavita) కు మళ్లి నిరాశే మిగిలింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నేటితో ఆమె కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. తన కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ED, CBI దాఖలు చేసిన కేసులో కవితకు జులై 3వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా నెల రోజుల వరకు కస్టడీ పొడిగించింది.
ఇప్పటికే పలు మార్లు ఎమ్మెల్సీ కవిత తరఫు న్యాయవాదులు మధ్యంతర బెయిల్ పిటిషన్ కొరిన విషయం తెలిసిందే.. కాగా తన బెయిల్ సవాల్ చేస్తే మరో వైపు సీబీఐ (CBI) , ఈడీ కౌంటర్ దాఖలు చేస్తున్నాయి. దీంతో ఎమ్మెల్సీ(MLC) కవితకు మధ్యంతర బెయిల్ పిటిషన్ ను పలు మార్లు కొట్టిస్తుంది రౌస్ అవెన్యూ కోర్టు.