Vijay Devarakonda: మహేశ్ బాబుకి సైడ్ ఇచ్చాడు
సూపర్ బ్రదర్ అంటూ మహేశ్ మీద ఓ ఆడియో ఫంక్షన్ లో అభిమానం చూపించిన రౌడీ, ఇప్పడు అదే సూపర్ స్టార్ కోసం తన సినిమాను వెనక్కి నెడుతున్నాడట.

Rowdy hero Vijay Deverakonda has postponed the release date of his film for Superstar Mahesh Babu's Guntur Karam.
సూపర్ స్టార్ మహేశ్ బాబు కోసం రౌడీస్టార్ విజయ్ దేవరకొండ పెద్ద త్యాగానికే సిద్దపడినట్టున్నాడు. సూపర్ బ్రదర్ అంటూ మహేశ్ మీద ఓ ఆడియో ఫంక్షన్ లో అభిమానం చూపించిన రౌడీ, ఇప్పడు అదే సూపర్ స్టార్ కోసం తన సినిమాను వెనక్కి నెడుతున్నాడట.
ఒక వైపు లైగర్ తో మాస్ పంచ్ పడింది. రొమాంటిక్ జోనర్ లో ఖుషీ చేస్తే చేతులు కాలాయి. ఇలా రెండు జోనర్లు పంచ్ ఇచ్చాక, ఫ్యామిలీ డ్రామాతో రాబోతున్నాడు విజయ్. అలా అచ్చొచ్చిన పరశురామ్ మేకింగ్ లోనే ఫ్యామిలీ స్టార్ గా మారాడు రౌడీస్టార్. అలా మ్రునాల్ ఠాగూర్ తోకలిసి తను చేసిన సినిమా 60శాతం పూర్తైంది. నవంబర్ ఎండ్ కల్లా మొత్త టాకీ పార్ట్, తోపాటు పాటల షూటింగ్ కూడా పూర్తికానుంది.
నిజం చెప్పాలంటే సంక్రాంతికి వచ్చే సినిమాల్లో గుంటూరు కారం కంటే ముందే ఫస్ట్ కాపీ విజయ్ మూవీ ఫ్యామిలీ స్టార్ ది వచ్చేలా ఉంది. అయినా సంక్రాంతి పోటీలో దిగుతున్నట్టే ఎనైన్స్ చేసి రౌడీ ఇప్పడు వెనక్కి తగ్గేలా ఉన్నాడు. జనవరి 14 కి అనుకున్న ఫ్యామిలీ స్టార్ మూవీని ఫిబ్రవరికి వాయిదా వేస్తారట. ఇదంతా గుంటూరు కారం టీం ఫ్యామిలీ స్టార్ టీంతో చర్చించాకే జరిగిందట.
ఏదేమైనా మహేశ్ బాబుకి విజయ్ దేవరకొండ మూవీ పోటీ ఇచ్చి ఏదో డ్యామేజ్ చేస్తుందనికాదు కాని, సీనియర్ హీరో మీద గౌరవం తోపాటు, అభిమానం ఉండటం వల్ల విజయ్ తన సినిమాను వాయిదా వేసుకుంటున్నాడట. సంక్రాంతికి ఎన్ని సినిమాలు పోటీ పడ్డా వసూల్లకొచ్చే ఇబ్బందులేమి ఉండవు.. కాని గుంటూరు కారం మూవీని భారీగా విడుదల చేసేందుకు త్రివిక్రమ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టే వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ ని హోల్డ్ చేసే ప్రాసెస్ లో విజయ్ సినిమాను వాయిదా వేసుకోవాలనగానే, రౌడీ టీం ఓకే చేసిందట.